సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి

Avalanche hit Siachen : సియాచిన్ హిమానీనదంపై... ఆర్మీ పాట్రోల్ ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా వచ్చిన మంచు తుఫానులో ఎనిమిది మంది సైనికులు చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు చనిపోయారు.

news18-telugu
Updated: November 19, 2019, 6:10 AM IST
సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి
ప్రతీకాత్మక చిత్రం (File - credit - twitter - sandeep)
  • Share this:
Avalanche hit Siachen : సియాచిన్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన మంచుతుఫానులో చిక్కుకున్న సైనికులు... గంటల తరబడి మంచులో ఉండిపోవడంతో... ఎనిమిది మందిలో ఆరుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మొత్తం 8 మందితో పెట్రోలింగ్ గ్రూప్... మంచు తుఫాను వచ్చిన ప్రదేశంలో విధులు నిర్వహిస్తోంది. అసలే 19వేల అడుగుల ఎత్తు... ఓవైపు గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ అందని పరిస్థితి (hypothermia) వల్ల సైనికులు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తుఫాను తర్వాత... ఆర్మీ... పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. మంచు చరియల్లోంచీ 8 మందినీ బయటకు తీసింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఆ ఇద్దరికీ దగ్గర్లోని మిలిటరీ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది.


సియాచిన్ గ్లేసియర్ అనేది... కారాకోరం రేంజ్‌లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ జోన్. అలాంటి ప్రదేశంలో ఎప్పుడూ మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే... క్షణాల్లో రక్తం గడ్డకట్టుకుపోతుంది. ప్రాణాలు పోతాయి. అక్కడ వీచే గాలులు కూడా ప్రాణాలు తీయగలవు.శీతాకాలంలో సియాచిన్ గ్లేసియర్‌లో మంచు తుఫాన్లు, మంచు చరియలు విరిగిపడే ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. అలాంటి చోట మన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి... రక్షణ విధులు నిర్వహిస్తున్నారు.


బుల్లి తెరే బెటరంటున్న పల్లవీ గౌడ
ఇవి కూడా చదవండి :

గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...

Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు ఇంటి చిట్కాలు...

Published by: Krishna Kumar N
First published: November 19, 2019, 6:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading