హోమ్ /వార్తలు /జాతీయం /

Eid Mubarak 2019: నేడు రంజాన్ పర్వదినం...శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Eid Mubarak 2019: నేడు రంజాన్ పర్వదినం...శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Eid Mubarak 2019: నేడు రంజాన్ పర్వదినం, తాజ్ మహల్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లి సోదరులు

Eid Mubarak 2019: నేడు రంజాన్ పర్వదినం, తాజ్ మహల్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లి సోదరులు

Eid-ul-Fitr 2019: రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ముగించిన వేళ ఈదుల్ ఫితర్ జరపడం ఆనవాయితీ, రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరపనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇంకా చదవండి ...

  మంగళవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఘనంగా సన్నాహాలు చేసుకున్నారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ముగించిన వేళ ఈదుల్ ఫితర్ జరపడం ఆనవాయితీ, రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరపనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే రంజాన్ పర్వదినం మతసామరస్యాన్ని, ఆత్మీయతను, సోదరభావాన్ని, సేవాతత్పరతకు చిహ్నంగా జరుపుకుంటారని ఇస్లాం మత గ్రంథాల్లో పేర్కొన్నారు. రంజాన్ పండుగ రోజు సేమ్యా ఖీర్ పాయసం ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పవచ్చు. అలాగే ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈద్ ముబారక్ అని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


  ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పర్వదినాన్ని రాష్ట్ర పర్వదినంగా అధికారంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదుల వద్ద పూర్తి స్థాయి సదుపాయాలను కల్పించారు. అలాగే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ముస్లిం సోదరులకు ఇప్పటికే అధికారికంగా ఇఫ్తార్ విందును సైతం అందించాయి.


  రంజాన్ పర్వదినం శాంతికి చిహ్నమని ఇస్లాం మతపెద్దలు చెబుతుంటారు. రంజాన్ పవిత్ర మాసంలో పేదవారికి ఉన్నదాంట్లో దానం చేయాలని పవిత్ర గ్రంథం ఖురాన్ చెబుతోంది. అందుకు అనుగుణంగా ఈ రోజు ముస్లిం సోదరులు తమ స్థాయికి తగినట్లు దాన ధర్మాలు చేస్తుంటారు. అలాగే ప్రభుత్వం కూడా ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు అందించడం విశేషం.


  First published:

  Tags: Cm jagan, CM KCR, India, Muslim Minorities, Narendra modi

  ఉత్తమ కథలు