EDIBLE OIL PRICES DROP KNOW WHY RATES ARE COOLING OFF UMG GH
Edible Oil Prices: గుడ్‌న్యూస్.. భారత్‌లో తగ్గుతున్న వంటనూనె ధరలు.. కారణం ఇదే..!
భారత్‌లో తగ్గనున్న వంటనూనె ధరలు.
భారతదేశం (India)లో గత కొద్ది నెలల్లో వంటనూనెల (Edible Oils) ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు వంటనూనెల ధరలు దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆయిల్ ధరలు (Reducing Prices) ఎందుకు తగ్గుతున్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం (India)లో గత కొద్ది నెలల్లో వంటనూనెల (Edible Oils) ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు వంటనూనెల ధరలు దిగివస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ అదానీ విల్మార్ వంటనూనెల ధరలను లీటరుకు రూ.10 తగ్గించింది. ఈ కంపెనీ తన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒక లీటర్ ప్యాక్ రిటైల్ ధరను రూ.220 నుంచి రూ.210కి తగ్గించింది. కొత్త ధరలతో ఫార్చ్యూన్ సోయాబీన్, ఫార్చ్యూన్ కాచీ ఘనీ (ఆవాల నూనె) ఒక లీటర్ ప్యాకెట్లు రూ.205 నుంచి రూ.195కి తగ్గాయి. ఇటీవలే, హైదరాబాద్ కంపెనీ జెమినీ ఎడిబుల్స్ & ఫ్యాట్స్ సైతం తన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధరలను రూ.15 వరకు తగ్గించింది. మరికొద్ది రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ధరలు తగ్గించే అవకాశం ఉంది. అయితే అసలు ఆయిల్ ధరలు (Reducing Prices) ఎందుకు తగ్గుతున్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడిబుల్ ఆయిల్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
భారత దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. ఆర్బీఐ వస్తువుల ధరలను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని కొంతమేర తగ్గించింది. ఫలితంగా కంపెనీలు కూడా వంటనూనెల ధరలు తగ్గిస్తున్నాయి. కేంద్రం జూన్ మూడో వారంలో ముడి పామాయిల్, సోయాయిల్, బంగారం, వెండికి సంబంధించిన బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. దాంతో ప్రస్తుతం ముడి పామాయిల్ కొత్త బేస్ దిగుమతి ధర టన్నుకు 1,625 డాలర్ల నుంచి 1,620 డాలర్లకు దిగివచ్చింది. అలానే ఆర్బీడీ (RBD) పామాయిల్ ధర టన్నుకు 1,757 డాలర్లు, ఆర్బీడీ పామోలిన్ ధర టన్నుకు 1,767 డాలర్లకు చేరుకుంది. క్రూడ్ సోయా ఆయిల్ బేస్ ఇంపోర్ట్ ధర టన్నుకు 1,866 డాలర్ల నుంచి 1,831 డాలర్లకు కేంద్రం తగ్గించింది. దిగుమతిదారు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని లెక్కించడానికి ఈ బేస్ ధరలు ఉపయోగపడతాయి.
అయితే వినియోగదారులకు తగ్గిన ధర ప్రయోజనాన్ని అందజేసేందుకు ధరలు తగ్గించినట్లు అదానీ విల్మార్ ఎండీ, సీఈఓ అంగ్షు మల్లిక్ పేర్కొన్నారు. ధరలు తగ్గినప్పటికీ నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదని స్వచ్ఛమైన నూనెలను కొనుగోలుదారులు పొందవచ్చని అన్నారు. తగ్గిన ధరలు సామాన్యుడికి ఊరట కలిగిస్తాయని తెలిపారు. ధరల తగ్గుదల వల్ల డిమాండ్ కూడా పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
భారత్‌లో వంటనూనెల దిగుమతులు
ఇండోనేషియా వంటనూనెల ఎగుమతులపై బ్యాన్ విధించడంతో ఏప్రిల్‌తో పోలిస్తే మేలో దేశంలో పామాయిల్ దిగుమతులు 10 శాతం పడిపోయాయి. నిజానికి ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా నిలుస్తోంది. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఎక్కువగా నూనెలను దిగుమతి చేసుకుంటోంది. మన దేశం ఏటా 13.5 మిలియన్ టన్నులకు పైగా వంటనూనెల నుంచి దిగుమతి చేసుకుంటే అందులో 8-8.5 మిలియన్ టన్నులు పామాయిల్ నూనె ఉంటుంది. ఇప్పుడు దేశం 45 శాతం ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఏటా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్‌ను ఇండోనేషియా నుంచి ఇండియా తెచ్చుకుంటుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.