Home /News /national /

ED RAIDS ON VIVO AND CHINA HOPES FOR TRULY FAIR PROBE UMG GH

ED Raids On Vivo: చైనా కంపెనీలకు భారత్ షాక్.. టాప్ సెల్ కంపెనీపై ఈడీ దాడులు.. చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వివోపై ఈడీ దాడులు

వివోపై ఈడీ దాడులు

ఇండియాలో చైనీస్‌ మొబైల్‌ కంపెనీ వివో(Vivo) ఆఫీస్‌లపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-Enforcement Directorate) దాడులు చేస్తోంది. ఈ దాడులపై చైనా ప్రభుత్వం స్పందించింది. విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే తమ సంస్థలకు నియమ నిబంధనలు పాటించాలని సూచిస్తామని పేర్కొంది.

ఇంకా చదవండి ...
ఇండియాలో చైనీస్‌ మొబైల్‌ కంపెనీ వివో(Vivo) ఆఫీస్‌లపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-Enforcement Directorate) దాడులు చేస్తోంది. ఈ దాడులపై చైనా ప్రభుత్వం స్పందించింది. విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే తమ సంస్థలకు నియమ నిబంధనలు పాటించాలని సూచిస్తామని పేర్కొంది. చైనా కంపెనీలకు చట్టపరమైన హక్కులు, అవకాశాలు దక్కడంలో కూడా సపోర్ట్‌ చేస్తామని తెలిపింది.

మీడియాలో సమావేశంలో వివో కార్యాలయాలపై జరుగుతున్న దాడుల గురించి అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందించారు. చైనీస్ మొబైల్ తయారీదారు సంస్థ వివోపై జరుగుతున్న దాడులను చట్టం, నిబంధనలకు అనుగుణంగా ఇండియా నిర్వహిస్తుందని, చైనా సంస్థలకు న్యాయమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. జరుగుతున్న పరిణామాలను చైనా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఆకాశంలో ఇవాళ అద్భుతం...భూమిపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై సూర్యకాంతి!


ఆయన మాట్లాడుతూ.. ‘నేను చాలాసార్లు స్పష్టం చేశాను. విదేశాలలో వ్యాపారం చేస్తున్నప్పుడు చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చైనా కంపెనీలకు సూచిస్తుంది. ఈ సమయంలో, చైనీస్ కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడంలో మేము వారికి సపోర్ట్‌ ఇస్తాం, భారత అధికారులు దర్యాప్తు, కార్యకలాపాలను నిర్వహించడంలో చట్టాలకు కట్టుబడి ఉంటారని, భారతదేశంలో పెట్టుబడులు పెట్టే, కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలకు నిజమైన న్యాయమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు.

 చైనా కంపెనీల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయి 
న్యూఢిల్లీలో చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.. చైనా సంస్థలపై భారత అధికారులు తరచుగా జరిపే దాడులు, కంపెనీల సాధారణ వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పారు. చైనా కంపెనీల గుడివిల్‌ను దెబ్బతీయడమే కాకుండా భారతదేశంలోని వ్యాపార వాతావరణానికి ఆటంకం కలుగుతోందని అన్నారు. ఇలా చేయడం వల్ల ఇతర దేశాల్లో సేవలు అందిస్తున్న చైనా సంస్థలపై కూడా ప్రభావం పడుతుందని తెలిపారు.

ఆర్థిక నేరాల అణిచివేతకు ప్రాధాన్యం
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో, సంబంధిత సంస్థలపై మనీలాండరింగ్ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం భారతదేశంలోని కనీసం 44 చోట్ల దాడులు చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద సోదాలు జరిగాయి.



తాము అధికారులకు సహకరిస్తున్నామని వివో ఇండియా ప్రతినిధి తెలిపారు. భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు చైనా కంపెనీలు, వాటికి అనుబంధంగా ఉన్న ఇండియన్‌ సంస్థలు మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడకుండా దాడులు చేస్తున్నారు.
చైనీస్ సంస్థలపై తనిఖీలను కఠినతరం చేయడానికి, ఆర్థిక నేరాలను అణిచివేసే చర్యలు తీసుకుంటున్నారు.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి రెండు దేశాల మధ్య రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా మద్దతు ఉన్న కంపెనీలు లేదా సంస్థలపై దశలవారీగా చర్యలు తీసుకుంటున్నారు.
Published by:Mahesh
First published:

Tags: China, Company, IT raids, Vivo

తదుపరి వార్తలు