• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • ED ATTACHES DMK MP S JAGATHRAKSHAKAN FAMILYS PROPERTY WORTH RS 89 CRORE BA

Enforcement Directorate: ఈడీ సంచలనం, ఎంపీ ఆస్తులు జప్తు

Enforcement Directorate: ఈడీ సంచలనం, ఎంపీ ఆస్తులు జప్తు

జగత్‌రక్షకన్, డీఎంకే ఎంపీ

డీఎంకే ఎంపీ జగత్‌రక్షకన్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించి సింగపూర్లో ఆస్తులు కూడబెట్టాలరని ఈడీ విచారణలో తేలింది.

  • Share this:
    DMK MP S Jagathrakshakan: తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ జగత్‌రక్షకన్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఆయనతో పాటు కుటుంబానికి చెందిన రూ.89.19 కోట్లను జప్తు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి సింగపూర్ కంపెనీ నుంచి అక్రమంగా నిధులు బదిలీ చేసినట్టు గుర్తించింది. అందుకే ఆస్తులను జప్తు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి ఆయన విదేశాల్లో ఆస్తులు కూడబెట్టాలరని విచారణలో తేలినట్టు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా జగత్ రక్షకన్ ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ సింగపూర్‌లోని సిల్వర్ పార్క్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 90 లక్షల షేర్లను కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఒక్కో షేర్ ధర ఒక అమెరికన్ డాలర్ చొప్పున కొన్నట్టు నిర్ధారించింది. 2017 జూన్ 15వ తేదీన వారు ఈ లావాదేవీ జరిపినట్టు తేల్చింది. అనంతరం తన పేరు మీద ఉన్న షేర్లను కుటుంబసభ్యుల పేర్ల మీదకు అనధికారికంగా బదిలీ చేసినట్టు గుర్తించింది. ఫెమా చట్టం ప్రకారం భారతీయులు సరైన అనుమతి లేకుండా విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం నిషేధం. ఫెమా చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం సదరు వ్యక్తికి సంబందించిన ఆస్తులను సీజ్ చేసే అధికారం ఈడీకి ఉంది. ఈ క్రమంలో తమిళనాడులో ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కలిపి రూ.89.19 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు