Home /News /national /

Bengal Elections: బెంగాల్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయన్న ప్రచారంపై ఈసీ క్లారిటీ..!

Bengal Elections: బెంగాల్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయన్న ప్రచారంపై ఈసీ క్లారిటీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకే విడత జరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని తేల్చేసింది. బెంగాల్‌లో ఐదో విడత ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరో విడత ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్నాయి. మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఒకే విడతలో...

ఇంకా చదవండి ...
    కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన తృణముల్, బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రోడ్‌షోలు, సభలతో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అయితే.. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లో ఒకే విడతలో ఎన్నికల నిర్వహణపై ఈసీ దృష్టిసారించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే.. ఈ వార్తలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. బెంగాల్‌లో మిగిలిన స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ఈసీ స్పష్టం చేసింది. ఒకే విడత జరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని తేల్చేసింది. బెంగాల్‌లో ఐదో విడత ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరో విడత ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్నాయి. మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదన తెరపైకొచ్చింది. కానీ.. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది. బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 16న అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్-19 వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై ఎన్నికల సంఘం పార్టీలతో చర్చించనుంది. ఇక.. బెంగాల్‌లో ఏప్రిల్ 17న జరగనున్న ఐదో విడత ఎన్నికలపై కూడా రాజకీయ పార్టీలకు, అధికార యంత్రాంగానికి ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా చూడాలని, ఓటర్ల మధ్య రెండు అడుగుల దూరం ఉండేలా చూడాలని ఈసీ ఆదేశించింది.

    బెంగాల్‌లో ఐదో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 17న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఐదో విడత ఎన్నికలు జరగడానికి 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల సంఘం పార్టీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

    దీంతో.. గురువారం సాయంత్రం నుంచే ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడనుంది. బెంగాల్‌లో జరగనున్న ఐదో విడత ఎన్నికల్లో 342 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోటి 13 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30కు ముగియనుంది. మొత్తం 15,789 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్‌లో రోజుకు 4వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: 5 State Elections, Election Commission of India, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు