Home /News /national /

ECI ANNOUNCED THAT YOUTH ABOVE 17 YEARS OF AGE WILL NOW BE ABLE TO APPLY FOR HAVING THEIR NAMES ENROLLED IN THE VOTERS LIST SK

Voter Card: 17 ఏళ్లకే ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Voter Card Application: కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో కూడా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి త్రైమాసికానికి అంటే.. ఇకపై మూడు నెలలకు ఒకసారి ఓటర్‌ జాబితాను అప్‌డేట్ చేస్తారు.

ఇంకా చదవండి ...
    మన దేశంలో 18 ఏళ్లు వయస్సు నిండిన వారికే ఓటు హక్కు ఉటుంది. 18 ఏళ్లు దాటిన తర్వాతే.. ఓటు హక్కుకు దరఖాస్తు చేయాల్సి ఉండేది. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే.. రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇకపై 18 ఏళ్లు నిండాల్సిన పనిలేదు. జనవరి 1 వరకు వేచిచూడాల్సిన పనిలేదు. 17వ ఏటలోనే.. ఓటర్ కార్డు (Voter Card)కు దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ఏళ్లు నిండిన యువతకు ముందస్తుగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం (Election Commission of India) స్పష్టం చేసింది.



    ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లు పైబడిన యువత ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది. 17 ఏళ్లు నిండిన తర్వాత ఓటు హక్కుకు దరఖాస్తు చేసినప్పటికీ...  18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్‌ కార్డును అందిస్తారు.



    మొన్నటి దాకా జనవరి 1న మాత్రమే ఓటర్ కార్డు దరఖాస్తుకు అవకాశం ఉండేది. ఇకపై  ఏడాదికి నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు.  కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో కూడా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి త్రైమాసికానికి అంటే.. ఇకపై మూడు నెలలకు ఒకసారి ఓటర్‌ జాబితాను అప్‌డేట్ చేస్తారు. 2023లో జనవరి 1 లేదా ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి...  18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో కేంద్ర న్యాయశాఖ మార్పులు చేసింది. దరఖాస్తు ఫారాలను కూడా మరింత సులభతరంగా మార్చనుంది ఈసీ.  కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి వస్తాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Election Commission of India, Voter Card

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు