దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Himachal Pradesh Elections) గత నెలలోనే షెడ్యూల్ విడుదలయింది. ఇప్పుడు గుజరాత్లో కూడా ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ మధ్యాహ్నం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు (Gujarat Assembly elections) షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్షన్ కమిషన్ (Election Commission) ప్రెస్ మీట్ నిర్వహించి.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.
PM Modi: ప్రకటనల్లో తన ఫోటోపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఆప్‌కు కౌంట
Election Commission to hold a press conference today to announce the schedule of the Gujarat Assembly elections
— ANI (@ANI) November 3, 2022
గత నెలలో ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అప్పుడే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని కూడా విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఒక్క హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. కొన్ని కారణాలతో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసింది. ఎట్టకేలకు ఇవాళ గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించబోతోంది ఈసీ. డిసెంబరులో ఒకేదశలో ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, గుజరాత్ ఎన్నికల తేదీకి ముందే ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు.
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. ఇవాళ షెడ్యూల్ విడుదలయితే.. పోలింగ్‌కు కనీసం నెల రోజుల సమయం అయినా ఉంటుంది. ఈ నేపథ్యంలో గుజరాత్లో డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. మేం కూడా పోటీల్లో ఉన్నామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Bjp, Congress, Gujarat, Gujarat Assembly Elections 2022