EC TELLS CENTRE TO RAMP UP COVID VACCINATION IN POLL BOUND STATES ELECTIONS UNLIKELY TO POSTPONE AMID OMICRON MKS
Omicron ఉన్నా ఎన్నికలపై ముందుకే -యూపీ సహా 5రాష్ట్రాలపై ఈసీ నిర్ణయం -కేంద్రానికి కీలక సూచనలు
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ
ఫిబ్రవరి నాటికి రోజువారీ కేసులు కనీసం లక్షకుపైగా వస్తాయన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా తప్పదనే చర్చ మొదలైంది. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించింది. ఎన్నికలు వాయిదా పడొచ్చనే ఊహాగానాలకు చెక్ పెడుతూ, ముందుకే వెళతామనే సంకేతాలిచ్చింది ఈసీ.
కరోనా వైరస్ రెండో వేవ్ లో లక్షల మందిని బలి తీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. యూరప్, అమెరికాలో కొత్త కేసులు, మరణాలు పెరగ్గా, భారత్ లోనూ ఇది చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సోమవారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగింది. ఫిబ్రవరి నాటికి రోజువారీ కేసులు కనీసం లక్షకుపైగా వస్తాయన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా తప్పదనే చర్చ మొదలైంది. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించింది. ఎన్నికలు వాయిదా పడొచ్చనే ఊహాగానాలకు చెక్ పెడుతూ, ముందుకే వెళతామనే సంకేతాలిచ్చింది ఈసీ. అయితే ఒమిక్రాన్, మిగతా కొవిడ్ వేరియంట్ల విషయంలో ఏం చేయాలనేదానిపై కేంద్రానికి ఈసీ పలు అభ్యర్థనలు పంపింది. వివరాలివి..
వచ్చే ఏడాది మార్చి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని కేంద్రానికి భారత ఎన్నికల సంఘం సోమవారంనాడు తెలిపింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో సహా కోవిడ్ కొత్త కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఈ సూచనలిచ్చింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై ఇప్పటికే కేంద్రాన్ని ఈసీ నివేదిక కోరింది..
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్, గోవాల్లో అర్హులైన 100 శాతం జనాభాకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో 85 శాతానికి తొలి డోసు ఇవ్వగా, మణిపూర్, పంజాబ్‌లో ఇది 80 శాతం కంటే తక్కువగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ డాటాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.
మరోవైపు, కోవిడ్ కేసుల పెరుగుదల ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు మధ్య అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఐదు రాష్ట్రాల్లో ర్యాలీల నిర్వహణపై భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఐటీబీబీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాలతో ముడిపడిన అంతర్జాతీయ సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన సూచనలిచ్చింది. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సైతం ఎన్నికల కమిషన్‌ను కలిసి దేశంలోని కోవిడ్ పరిస్థితిని వివరించారు. కాగా, ఎన్నికల సంసిద్ధతను సమీక్షిచేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయన సహచర ఎన్నికల కమిషనర్లు మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.