• Home
 • »
 • News
 • »
 • national
 • »
 • EC LIKELY TO CLUB THE LAST 3 PHASES OF THE ELECTION TOGETHER SSR

EC: బెంగాల్‌లో ఆ మూడు విడతల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ఈసీ నిర్ణయం..?

కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయం

పశ్చిమ బెంగాల్‌లో ఆరు, ఏడు, ఎనిమిదో విడత జరగాల్సిన ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 17న జరగాల్సిన ఐదో విడత ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే జరపాలని నిర్ణయించిన ఈసీ మిగిలిన మూడు విడతలను కలిపి ఒకేసారి నిర్వహించాలని...

 • Share this:
  కోల్‌కత్తా: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో విడతల వారీగా ఎన్నికలను నిర్వహించడం సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఆరు, ఏడు, ఎనిమిదో విడత జరగాల్సిన ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 17న జరగాల్సిన ఐదో విడత ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే జరపాలని నిర్ణయించిన ఈసీ మిగిలిన మూడు విడతలను కలిపి ఒకేసారి నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ పార్టీల రోడ్‌షోలు, బహిరంగ సభల కారణంగా కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు ఈసీ భావిస్తోంది.  కోవిడ్-19 ప్రొటోకాల్ పాటించే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని రాజకీయ పార్టీలు చెబుతున్నప్పటికీ వాస్తవంలో అది కనిపించడం లేదు. గుంపులుగుంపులుగా సభలకు వెళుతున్నారు. నేతలు కూడా అవేవీ పట్టించుకోకుండానే ఎన్నికల ప్రచారం, సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగాల్‌లో కరోనా కేసులు పెరగడానికి కూడా బీజేపీనే కారణమని చెప్పడం కొసమెరుపు. బీజేపీ బెంగాల్‌లోకి ఎన్నికల ప్రచారం పేరుతో స్థానికేతరులను తీసుకొస్తుందని.. వైరస్ వ్యాప్తికి వారు కారణమవుతున్నారని మమత చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి సభలు నిర్వహించకుండదని సీపీఎం నిర్ణయించింది. బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 16న అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్-19 వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై ఎన్నికల సంఘం పార్టీలతో చర్చించనుంది.
  Published by:Sambasiva Reddy
  First published: