• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • EASE OF LIVING INDEX BENGALURU IS THE BEST CITY TO LIVE IN INDIA KAKINDA GETS SPECIAL PLACE SK

Ease of Living Index: నివాస యోగ్య నగరాలు.. బెస్ట్ సిటీ ఇదే.. కాకినాడకు ప్రత్యేక స్థానం

Ease of Living Index: నివాస యోగ్య నగరాలు.. బెస్ట్ సిటీ ఇదే.. కాకినాడకు ప్రత్యేక స్థానం

ప్రతీకాత్మక చిత్రం

Ease of Living Index 2020: ఇటు ఈజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌లో గానీ. .అటు మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌లో గానీ.. తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌ను రూపొందించారు.

  • Share this:
    మన దేశంలో ఎన్నో పెద్ద నగరాలు ఉన్నాయి. అందులో ఉత్తమ నివాసయోగ్య నగరంగా కర్నాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 10లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల కేటగిరీలో.. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా బెంగళూరుకు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో పుణె నిలిచింది. మన హైదరాబాద్‌కు టాప్ 10లో చోటు దక్కలేదు. ఈజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్-2020 [EoLI]ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 111 నగరాలకు సంబంధించిన ర్యాంకులను ప్రకటించింది.

    నివాసయోగ్యమైన నగరాలు (10లక్షలకు పైగా జనాభా కేటగిరి)
    1. బెంగళూరు
    2. పుణె
    3. అహ్మదాబాద్
    4. చెన్నై
    5. సూరత్
    6. నవీ ముంబై
    7. కోయంబత్తూరు
    8. వడోదర
    9. ఇండోర్
    10. గ్రేటర్ ముంబై

    ఇక 10 లక్షల లోపు జనాభా ఉన్న నివాసయోగ్యమైన నగర జాబితాల్లో ఏపీ నుంచి కాకినాడకు చోటు దక్కింది. ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకే నగరమూ ఇందులో లేదు. ఈ జాబితాలో సిమ్లాకు అగ్రస్థానం దక్కగా.. భువనేశ్వర్ రెండో స్థానంలో నిలిచింది.

    నివాసయోగ్య నగరాలు (10 లక్షల లోపు జనాభా కేటగిరి)
    1. సిమ్లా
    2. భువనేశ్వర్
    3. సిల్వసా
    4. కాకినాడ
    5. సేలం
    6. వేలూరు
    7. గాంధీనగర్
    8. గురుగ్రామ్
    9. దావణగెరె
    10. తిరుచిరాపల్లి

    ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌తో పాటు మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. అందులో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటిగిరీలో.. విశాఖపట్టణం 9వ స్థానంలో నిలిచింది. ఇక పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో.. తిరుపతి రెండో స్థానంలో నిలిచింది.
    మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్


    ఇటు ఈజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌లో గానీ. .అటు మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌లో గానీ.. తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. హైదరాబాద్ 24వ స్థానంతో సరిపెట్టుకుంది. పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో వరంగల్ 19, కరీంనగర్ 22 స్థానాల్లో నిలిచాయి. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌ను రూపొందించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు