సరళతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో భారత్ 23 స్థానాలు ఎగబాకి 77వ ర్యాంకులో నిలిచింది. దక్షిణాసియా దేశాల్లో భారత్ నెంబర్.1 స్థానంలో నిలిచింది. 190 దేశాల్లో పరిస్థితులను 10 అంశాలను ప్రామాణికాలుగా పరిగణలోకి తీసుకుని ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. వాణిజ్య అనుకూల విధానాలు, నిర్మాణ అనుమతులు, రుణం పొందడంలో సరళత, చిన్న సంఖ్యలోని పెట్టబడిదారులకు రక్షణ తదితర అంశాలను ప్రామాణికలుగా ఈ నివేదికను ప్రకటించారు.
పది అంశాలను ప్రమాణాలుగా తీసుకుని ఈ నివేదికను రూపొందించిన ప్రపంచ బ్యాంకు, పదింటిలో ఆరు అంశాల్లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి భారత్ ర్యాంకును మెరుగుపరుచుకున్న ఆరు అంశాలు ఇవే.
1. నిర్మాణ అనుమతులు
2.సరిహద్దు వాణిజ్యం
3.వ్యాపార ప్రారంభం
4.విద్యుత్ కనెక్షన్
5.పన్నుల చెల్లింపు
6. సరిహద్దు వాణిజ్యం
1.ఆస్తుల రిజిస్ట్రేషన్
2.చిన్న సంఖ్యలోని పెట్టుబడిదారులకు రక్షణ
3.ఒప్పందాల అమలు
4.దివాలా పరిష్కారం
ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశంలో భారత్ 166వ ర్యాంకులో నిలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ అంశంలో భారత్ 0.46 శాతం మాత్రమే పెరుగుపడింది. వచ్చే ఏడాది 50వ ర్యాంకు సాధిస్తామని చెబుతున్న మోదీ సర్కారు, అనుకున్న లక్ష్యానికి చేరువకావాలంటే ఈ అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.