Earthquake : కొన్నాళ్లుగా ఉత్తరాదిన భూకంపాలు వస్తుంటే.. ఇప్పుడు దక్షిణాన అండమాన్ నికోబార్ దీవుల్లో నిన్న భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4గా నమోదైంది. రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కి 140 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంపం రాత్రి 11.56కి వచ్చింది.
"4.0 తీవ్రతతో భూకంపం మార్చి 31, 2023న 23:56 సమయంలో సంభవించింది. ఇది భూమిలో 28 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో పోర్ట్‌బ్లేర్ 140 కిలోమీటర్ల దూరంలో వచ్చింది అని NCS ట్వీట్ చేసింది.
Earthquake of Magnitude:3.5, Occurred on 01-04-2023, 03:04:30 IST, Lat: 27.78 & Long: 85.25, Depth: 25 Km ,Location: 10km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/yLKqIWmTtG @ndmaindia @Indiametdept pic.twitter.com/REtikAqdYU
— National Center for Seismology (@NCS_Earthquake) March 31, 2023
ఈ భూకంపం తీవ్రత 4 కాబట్టి... దీని గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఇళ్లు చిన్నగా బీటలు వారే అవకాశం మాత్రమే ఉంటుంది. అదీ కాక ఇది భూమి లోపల 28కిలోమీటర్ల లోతున వచ్చింది కాబట్టి.. దీని ప్రభావం పెద్దగా కనిపించదు. కాకపోతే.. మార్చి 24న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ దగ్గర 3.9 తీవ్రతతో ఓ భూకంపం వచ్చింది. దానికీ దీనికీ ఏదైనా లింక్ ఉందా అన్నది NCS పరిశీలిస్తోంది. ఆ భూకంపం రాత్రి 10.28కి వచ్చింది. అది భూమిలో 10 కిలోమీటర్ల లోతులో మాత్రమే వచ్చింది.
అండమాన్‌లో భూకంపం వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. అంతా నిద్రలో ఉన్నప్పుడు వచ్చింది. కనీసం భూ ప్రకంపనలు కూడా వారికి వచ్చి ఉండవు. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత దాటినప్పుడు మాత్రమే ప్రకంపనలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అది కూడా భూమికి ఎక్కువ లోతులో రానప్పుడే. లోతు ఎక్కువయ్యే కొద్దీ భూకంప ప్రభావం తక్కువ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andaman, Earth quake, Earth Tremors, Earthquake