ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీకి వాయువ్య దిశలో 49 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు EMSC సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6గా నమోదయినట్లు వెల్లడించింది.

  • Share this:
    ఇప్పటికే కరోనావైరస్‌తో వణికిపోతున్న దేశ రాజధాని ఢిల్లీని భూప్రకంపనలు సైతం భయపెడుతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనం వణికిపోయారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీకి వాయువ్య దిశలో 49 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు EMSC సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6గా నమోదయినట్లు వెల్లడించింది. హర్యానాలోని రోహతక్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. కాగా, గత నెలలోనూ ఢిల్లీలో భూమి కంపించింది. ఏప్రిల్ 12, 13న పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. ఇలా వరుస భూప్రకంపనలతో ఢిల్లీ ప్రజల్లో ఆందోళన నెలకొంది.


    అంతకుముందు ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ-ఫరిదాబాద్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షం పడింది. దాంతో ఎండలు, ఉక్కపోత నుంచి ఢిల్లీ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
    Published by:Shiva Kumar Addula
    First published: