ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. వణికిన ఉత్తర భారతం

ప్రతీకాత్మక చిత్రం

పలు సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండడంతో భారత్‌పై భూకంపం ప్రభావం తక్కువగా ఉంది.

  • Share this:
    ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఆ ప్రభావంతో భారత్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని భూప్రకంపనలు వణికించాయి. పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సాయంత్రం 05.13 గంటల సమయంలో పలు సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండడంతో భారత్‌పై భూకంపం ప్రభావం తక్కువగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: