ఢిల్లీలో భూప్రకంపనలు.. రాజధాని ప్రజల్లో భయాందోళన

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది.

  • Share this:
    ఇప్పటికే కరోనా వైరస్‌లో వణికిపోతున్న ఢిల్లీని.. వరుస భూప్రకంపనలు సైతం భయపెడుతున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. సాయంత్రం 06.50 ప్రాంతంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది. 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రత 4.3గా ఉందని.. గురుగ్రామ్‌కు నైరుతి దిశగా 43 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఢిల్లీలో భూమి కంపించడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలుగా వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

    వరుస స్వల్ప భూప్రకంపనల నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో పెద్ద భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ) స్మిస్మిక్ జోన్-4 కిందకు వస్తుందని చెబుతున్నారు. ఢిల్లీలో పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు వెలిశాయి.. కానీ అక్కడి బిల్డర్లు ఎవరూ Bureau of Indian Standards (bis) నిబంధనలను పాటించడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి భూంకంప ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: