ఢిల్లీలో భూకంపం.. వణికిపోయిన ఉత్తర భారతం

ప్రతీకాత్మక చిత్రం

రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదయినట్లు యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది.

  • Share this:
    ఉత్తర భారతాన్ని భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సాయంత్రం 04.30 గంటల సమయంలో 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్‌లోని రావల్పిండికి 92 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదయినట్లు యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) మాత్రం 5.8గా పేర్కొంది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్‌లో భూప్రకంపనలు వచ్చినట్లు ANI వార్తా సంస్థ వెల్లడించింది.
    First published: