EARTHQUAKE TODAY 6 1 MAGNITUDE QUAKE HITS INDIA MYANMAR BORDER REGION TREMORS FELT IN KOLKATA BANGLADESH SK
Mizoram Earthquake: మిజోరాంను వణికించిన భారీ భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు
ప్రతీకాత్మక చిత్రం
Mizoram Earthquake: మిజోరంలోని తెంజ్వాల్కు ఆగ్నేయ దిశగా 73 కి.మీ. దూరంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా ఉన్నట్లు వెల్లడించింది.
మిజోరాంను భారీ భూకంపం (Mizoram Earthquake) వణికించింది. శుక్రవారం ఉదయం 05.15 గంటలకు మిజోరంలోని తెంజ్వాల్కు ఆగ్నేయ దిశగా 73 కి.మీ. దూరంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా ఉన్నట్లు వెల్లడించింది. భూమికి 12 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. భూకంపంతో మిజోరం ప్రజలు వణికిపోయారు. ఉదయాన్నే భూంకంప రావడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. అప్పటికే నిద్రలేచిన వారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇండియా, మయన్మార్ సరిహద్దులో వచ్చిన ఈ భూకంపంతో కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు అక్కడి ప్రజలు చెప్పారు. ఐతే ఇళ్ల ధ్వంసం, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు.
అదే సమయంలో బంగ్లాదేశ్‌లోనూ భూకంపం (Bangladesh earthquake) వచ్చింది. చిట్టగాంగ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చిట్టగాంగ్‌కు తూర్పు దిశలో 183 కి.మీ. దూరంలో భూమికి 60 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మిజోరాంలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. కానీ NCS మాత్రం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.