హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Earthquake: ఢిల్లీని వణికించిన భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు.. నేపాల్‌లో పలువురు మృతి

Earthquake: ఢిల్లీని వణికించిన భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు.. నేపాల్‌లో పలువురు మృతి

నేపాల్‌ (Nepal Earthquake)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్, మణిపూర్‌లోని కొన్ని చోట్ల కూడా భూప్రకంపనలు సంభించాయి. 

నేపాల్‌ (Nepal Earthquake)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్, మణిపూర్‌లోని కొన్ని చోట్ల కూడా భూప్రకంపనలు సంభించాయి. 

నేపాల్‌ (Nepal Earthquake)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్, మణిపూర్‌లోని కొన్ని చోట్ల కూడా భూప్రకంపనలు సంభించాయి. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భూకంప ధాటికి దేశరాజధాని ఢిల్లీ (Delhi Earthquake) వణికిపోయింది. అర్ధరాత్రి తర్వాత  01.57 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ నుంచి నేపాల్ (NEPAL), చైనా (China) వరకు భూప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది.   నేపాల్‌లోని బుధాకోట్ ప్రాంతానికి 3 కి.మీ దూరంలో.. భూమికి 10 కి.మీ. లోతులో భారీ భూంకంపం సంభవించినట్లు  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే (USGS) మాత్రం 5.6 తీవ్రత నమోదయినట్లు తెలిపింది.

నేపాల్‌ (Nepal Earthquake)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్ , మణిపూర్‌లోని కొన్ని చోట్ల కూడా భూప్రకంపనలు సంభించాయి.  అర్ధరాత్రి భూమి ఒక్కసారిగా కుదుపుకు గురైనట్లు తమకు అనిపించిందని ఢిల్లీకి చాలా మంది ప్రజలు చెబుతున్నారు. రాత్రివేళల్లో ఆఫీసుల్లో పనిచేసే వారికి కూడా ఈ అనుభవం ఎదురయింది. ఎర్త్ క్వేక్ అలారమ్ మోగడంతో ఆఫీసుల నుంచి ఉద్యోగులు పరుగులు పెట్టారు. మంచాలు కదిలినట్లుగా అనిపించడంతో స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. మళ్లీ 10, 15 నిమిషాల తర్వాతే తిరిగి లోపలికి వెళ్లిపోయారు.

జ్ఞానవాపి మసీదు కేసులో ట్విస్ట్..ఆరోజే తదుపరి విచారణ..కారణం ఇదే.

ఈ భూకంపానికి కొన్ని గంటల ముందు కూడా భూమి కంపించింది. నవంబరు 9 మంగళవారం రాత్రి 8.52 గంటలక సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌, నేపాల్ సరిహద్దులో ఉంది. ఈ భూకంపం కూడా భూమికి 10 కి.మీ. లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

భూకంపం వల్ల మనదేశంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనప్పటికీ.. నేపాల్‌లో మాత్రం విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. దోతి జిల్లాలో ఇల్లు కూలి ముగ్గురు మరణించారు. పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

First published:

Tags: Earth quake, Earth Tremors, Earthquake

ఉత్తమ కథలు