Earthquake : మంగళవారం రాత్రి ఢిల్లీకి దగ్గర్లో చిన్న భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది, రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. ఢిల్లీకి పశ్చిమంగా 8 కిలోమీటర్ల దూరంలో.. రాత్రి 9.30కి భూకంపం వచ్చినట్లు తెలిసింది. దీని వల్ల ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. అలాగే.. నోయిడా, ఘజియాబాద్‌లో కూడా చిన్నగా ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు.
సాధారణంగా తీవ్రత 4 కంటే తక్కువగా ఉంటే.. వాటిని చిన్న భూకంపాలుగా పరిగణిస్తారు. అంటే వాటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కాకపోతే... ఈ నెలలో ఢిల్లీలో మూడోసారి భూమి కంపించింది. ఇది ఆందోళనకర అంశం. చిన్న చిన్న కదలికల తర్వాత ఒకేసారి పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది.
An earthquake of magnitude 2.5 occurred 8 km west of New Delhi at around 9.30pm today. The depth of the earthquake was 5 km below the ground: National Center for Seismology pic.twitter.com/f0V0A2Mtky
— ANI (@ANI) November 29, 2022
ఈమధ్యే నేపాల్, ఇండొనేసియాలో భారీ భూకంపాలు వచ్చాయి. వాటి వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నవంబర్ 9న పశ్చిమ నేపాల్‌లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఆరుగురు చనిపోగా.. కొన్ని ఇళ్లు నాశనమయ్యాయి. నవంబర్ 21 ఇండొనేసియా.. దీవి జావాలో వచ్చిన భూకంపం వల్ల 268 మంది చనిపోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. చాలా ఇళ్లు కూలిపోయాయి.
ప్రధానంగా హిమాలయ పలకాల్లో భారీ కదలికలు (seismologically-active Himalayan region) కంటిన్యూగా జరుగుతున్నాయి. అందువల్ల హిమాలయాల పరిసర ప్రాంతాల్లో తరచూ భూకంపాలు వస్తున్నాయి. ఆ ప్రభావం రాజధాని ఢిల్లీపై పడుతోంది. భూకంపం వచ్చిన ప్రతిసారీ ఉత్తర భారత దేశ ప్రజలు ఉలిక్కిపడే పరిస్థితి ఉంటోంది. అప్రమత్తంగా ఉండటమే మనం చేయగలిగింది అని నిపుణులు చెబుతున్నారు. ప్రకంపనలు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండకుండా.. ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.