ఈశాన్య భారతాన్ని వణికించిన భూ ప్రకంపనలు

ప్రతీకాత్మక చిత్రం

వీటి ప్రభావంతో గువాహటి సహా అసోంలోని పలు ప్రాంతాలతో పాటు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

  • Share this:
    ఈశాన్య భారతాన్ని భూకంపం వణికించింది. మణిపూర్‌లో 13 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకపంనలు సంభవించాయి. వాసులను వణికించాయి. వీటి తాలూకు ప్రకంపనలు దాదాపు ఈశాన్య భారతమంతటా వ్యాపించాయి. ఇవాళ రాత్రి 08.12 గంటలకు మొయిరాంగ్‌కు 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయింది. ఆ తర్వాత 08.25 గంటలకు మరోసారి భూమి కంపించింది. మణిపూర్‌లోని కాక్చింగ్‌కు 11 కి.మీ.దూరంలో ఇది రికార్డయింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయింది. వీటి ప్రభావంతో గువాహటి సహా అసోంలోని పలు ప్రాంతాలతో పాటు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూప్రకంపనలతో మణిపూర్ ప్రజలు భయంతో వణికిపోయారు. ఐతే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: