హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Earthquake In Meghalaya: మేఘాలయలో భూకంపం

Earthquake In Meghalaya: మేఘాలయలో భూకంపం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని షిల్లాంగ్ తర్వాత రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరమైన "తురా(Tura)"లో ఇవాళ ఉదయం 6.32 గంటల సమయంలో భూమి కంపించింది.

Earthquake:మేఘాలయా (Meghalaya)రాష్ట్రంలో ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. రాజధాని షిల్లాంగ్ తర్వాత రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరమైన "తురా(Tura)"లో ఇవాళ ఉదయం 6.32 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.0గా నమోదయింది. తురాకి 43 కిలోమీటర్ల దూరంలో భూకం కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS)తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పింది.

మరోవైపు, టిబెట్‌లోని జిజాంగ్‌ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఉదయం 4.01 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది.. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Shocking : ఫుల్ గా మందుకొట్టి ఇంటికొచ్చిన సాఫ్ట్ వేర్..భార్యతో ఆ విషయమై గొడవ..అనంతరం దారుణం

ఇటీవల తుర్కియేగా పేరు మార్చుకున్న టర్కీలో కూడా భూకంపం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి తుర్కియేలోని వాన్ ప్రావిన్స్‌లో రిక్టర్​ స్కేల్​పై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. వాన్‌లోని తుస్బా జిల్లాకు సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:35 గంటలకు ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై సమాచారం లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Earth quake, Meghalaya

ఉత్తమ కథలు