ఈశాన్య భారత్‌లో భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

భూమి లోపల దాదాపు 40కి.మీ లోతు నుంచి ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. భూకంపంతో అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల ప్రజలు భయంతో పరుగులు పెరిగినట్టు సమాచారం. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

news18-telugu
Updated: April 24, 2019, 6:46 AM IST
ఈశాన్య భారత్‌లో భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 6:46 AM IST
ఈశాన్య భారత్‌లో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.3గా నమోదైంది. చైనా, అసోంలను ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కి.మీ దూరంలో.. అసోంలోని దిబ్రుగర్‌కు 9కి.మీ దూరంలో భూకంపం సంభవించిన కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూమి లోపల దాదాపు 40కి.మీ లోతు నుంచి ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. భూకంపంతో అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల ప్రజలు భయంతో పరుగులు పెరిగినట్టు సమాచారం. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...