Delhi Earthquake: ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రత 2.3గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. శుక్రవారం తెల్లవారుజామున 05.02 సమమంలో భూమి కంపించింది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూకి కంపించింది. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రత 2.3గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. న్యూఢిల్లీకి పశ్చిమ వాయువ్య దిశలో 18 కి.మీ. దూరంలో.. భూమి నుంచి 5 కి.మీ. లోతులో భూకేంద్రం కేంద్రాన్ని గుర్తించారు. 2.3 తీవ్రత అంటే చాల స్వల్ప భూకంపం. దీని వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. భూమి లోపలి పొరల్లో కదలికల వల్లే ఇలాంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు.
8 రోజుల్లో రెండవది..
ఢిల్లీలో గత ఎనిమిది రోజుల్లో ఇది రెండో భూకంపం డిసెంబరు 17న కూడా భూమి కంపించింది. 4.2 తీవ్రతతో భూకంపం రావడంతో ఢిల్లీ ప్రజలు వణికిపోయారు. ఆ రోజు రాత్రి 11.46 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రాన్ని రాజస్థాన్‌లోని అల్వార్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని భూకంపాలు స్పల్ప తీవ్రత కలిగినవే అయినప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రకంపనలకు కారణం ఏంటని.. ఇవి దేనికి సంకేతాలని కలవరపడుతున్నారు.