హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Earthquake : అండమాన్ లో భూకంపం

Earthquake : అండమాన్ లో భూకంపం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.2 గంటలకు క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యాన 70 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.

Earthquake Hits Andaman : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.2 గంటలకు క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యాన 70 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS)తెలిపింది. భూ ప్రకంపనలు రాగానే ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారని సమాచారం. కాగా, భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

మరోవైపు,శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీ పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలోని యమనా ఘాటి నుంచి బార్కోట్ వరకు, పురోలా నుంచి యమునోత్రి వరకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైందని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్​లోని చాలా ప్రాంతాలు భూకంప తీవ్రత అధికంగా ఉండే జోన్ 4, 5 పరిధిలోకి వస్తాయి. కాగా,ఉత్తరాఖండ్​, అండమాన్​లలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Andaman, Earth quake, Earth Tremors

ఉత్తమ కథలు