Home /News /national /

E VOTE TELANGANA ELECTION COMMISSION IT DEPT CDAC IIT DEVELOPS EVOTE APP TO CAST VOTE FROM HOME SK

E-Vote: ఇంటి నుంచే ఓటు.. ఒక్క క్లిక్‌తో నచ్చిన నాయకుడి ఎన్నిక.. రిగ్గింగ్‌కు నో ఛాన్స్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

E-vote: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), తెలంగాణ ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌ (CDAC), బొంబాయి ఐఐటీ (IIT-Bombay), భిలాయ్‌ ఐఐటీ (IIT-Bhilai) ప్రొఫెసర్లు కలిసి బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వంటి టెక్నాలజీతో ఈ-ఓటింగ్‌ యాప్‌‌ను రూపొందించారు.

ఇంకా చదవండి ...
  దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోలింగ్ శాతం మాత్రం తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకు ఓకే. కానీ ఉన్నత విద్యావంతులున్న పట్టణాలు, పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం తక్కువ పోలింగ్ శాతం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీ వంటి ఎన్నికల్లో ఒక్కోసారి 50శాతం కూడా ఓటింగ్ ఉండడం లేదు. గురువారం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన భవానీపూర్ ఉపఎన్నికల్లో కూడా తక్కువ పోలింగ్ నమోదయింది. అక్కడ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నా.. ఓటు వేసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే ఓటింగ్ విధానంలో మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే కోరినవన్నీ డోర్ డెలివరీ అవుతున్నాయి. ఉద్యోగాలు కూడా ఇంటి నుంచే చేస్తున్నారు. అలాగే ఓటును కూడా ఇంటి నుంచే వేసే సాంకేతికత కూడా సిద్ధమవుతోంది. ఒక్క క్లిక్‌తో నచ్చిన నాయకుడిని ఎన్నుకునే ఈ-ఓటింగ్ విధానం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటోంది. మొబైల్‌లో యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని దాని ద్వారానే ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూలో నిలబడాల్సిన పనిలేదు.

  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), తెలంగాణ ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌ (CDAC), బొంబాయి ఐఐటీ (IIT-Bombay), భిలాయ్‌ ఐఐటీ (IIT-Bhilai) ప్రొఫెసర్లు కలిసి బ్లాక్‌ చైన్‌, కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వంటి టెక్నాలజీతో ఈ-ఓటింగ్‌ యాప్‌‌ను రూపొందించారు. ఓటింగ్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన.. ప్రభుత్వాలే కదలిపోతాయి. అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతో ప్రమాదకరం. అందుకే ఎన్నో ప్రయోగాలు, పరిశీలనల అనంతరం ఈ-ఓటింగ్ యాప్‌కు తుదిరూపు ఇచ్చారు. రిగ్గింగ్‌కు ఛాన్స్‌ లేకుండా అనేక భద్రతా అంశాలను పరిగణనలోకి దీనిని రూపొందించారు. గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబరు ఆధారంగా ఓటర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దేశంలో ఎక్కడ ఉన్నవారైనా.. ఎక్కడి నుంచైనా.. ఈ యాప్ సాయంతో ఓటు వేయవచ్చు. సైనికులు, వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు అక్కడి నుంచే తమ ఊరి నాయకుడిని ఎన్నుకోవచ్చు.

  Teenmar mallanna in BJP : బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. విడుదల చేయించాలని  అమిత్ షాకు లేఖ

  ఓటింగ్‌ విధానం

  ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారు ముందుగా ఈ-ఓటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకోసం మొబైల్ నెంబర్, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి. అదే ఫోన్‌తో లైవ్ ఫొటోను దిగి అప్‌లోడ్ చేయాలి. ఓటర్ కార్డు, ఆధార్ కార్డులోని ఫొటోలతో తాజా ఫొటోను ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో సరిపోల్చుకొని నిర్ధారించుకుంటుంది. అంతటితో అయిపోలేదు. ఓటీపీతో కూడా ధృవీకరించుకుంటుంది. ఇవన్నీ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

  అమిత్ షా చేసిన సాయాన్ని మరిచిపోలేను.. ఆ విషయాలను గుర్తుచేసుకున్న దిగ్విజయ్

  రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు పోలింగ్‌ రోజున యాప్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటు వేసే ముందు కూడా మరోసారి లైవ్ ఫొటోను ధృవీకరించుకుంటుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో తీసుకున్న ఫొటో, ఓటు వేసేందుకు ముందు తీసుకున్న ఫొటోలను సరిపోల్చుకున్నాక.. యాప్‌ స్క్రీన్‌పై బ్యాలెట్‌ పేపర్‌ డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు మీకు నచ్చిన అభ్యర్థి, పార్టీకి ఓటు వేయవచ్చు. మీరు ఎవరికి ఓటు వేశారో స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎక్కడా వ్యక్తుల ప్రమేయం ఉండదు. ఓటింగ్ ప్రక్రియ మొత్తం సాంకేతికత సాయంతోనే సాగుతుంది. ఈ-ఓట్‌ విధానంలో వచ్చిన ఓట్లను లెక్కించేందుకు.. కౌంటింగ్ సమయంలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు.

  ఈ-ఓట్‌ విధానంలో ఓటు వేయడానికి ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత.. మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం ఉండదు. యాప్ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది. లైవ్‌ ఫొటోతో నిర్ధారణ అయితేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేయవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ఓటు వేయడానికి వీలు పడదు.

  Congress Crisis: పంజాబ్ సంక్షోభంతో చిక్కుల్లో కాంగ్రెస్.. గళం పెంచిన సీనియర్లు

  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినందున అవకతవకలకు ఆస్కారం ఉండదు. రిగ్గింగ్‌కు ఛాన్స్ లేదు. ఒకరి బదులు మరొకరు ఓటు వేయలేరు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో వివరాలు మార్చడానికి వీలుండదు. ఫొటోలను సరిపోల్చడానికి కృత్రిమమేధ ఉపయోగపడుతుంది. ఫోన్‌ను హ్యాక్‌ చేయడానికి వీలులేని టెక్నాలజీని ఇందులో వినియోగించారు.

  JANASENA vs YCP: పవన్ శ్రమదానానికి నో పర్మిషన్..జనసేన-వైసీపీ మధ్య ముదురుతున్న వార్

  పోలింగ్‌ కేంద్రానికే వచ్చి ఓటు వేయాల్సిన అవసరం లేకుండా ఈ-ఓట్‌ విధానాన్ని అభివృద్ధి చేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన విషయం తెలిసిందే. కరోనా వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ-ఓటింగ్ విధానం ఎంతో దోహద పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ-ఓట్ యాప్‌లో అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే, ముందుగా రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని పరిగణలోకి తీసుకొని, అందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. మొదట కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరిశీలిస్తారు. అది విజయవంతమై అంతా సజావుగా జరిగిన తర్వాత.. దీనికి తుది ఆమోదం లభించే అవకాశముంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Election Commission of India, Elections, Polling, Telangana, Vote

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు