E COMMERCE PLATFORMS LIKE AMAZON AND FLIPKART MAY GET GOOD NEWS IN BUDGET 2021 HSN
Union Budget 2021: నిర్మలమ్మ కొత్త బడ్జెట్ లో.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు పండగలాంటి వార్త..?
నిర్మల సీతారామన్ (Image;ANI)
ఫిబ్రవరి ఒకటిన కేంద్రం కొత్త బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. రోజు కూలీల పరిస్థితి ఏంటి.? నిరుద్యోగుల సంగతేంటి.? సగటు ఉద్యోగికి ఏమేం అంశాల్లో మేలు జరగబోతోంది.? అనే అంశాలపై రోజూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రంగానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా మహమ్మారి విజృంభన తర్వాత, కొవిడ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో కేంద్రం కొత్త బడ్జెట్ ను మరికొద్ది రోజుల్లోనే ప్రవేశపెట్టబోతోంది. బడా వ్యాపారవేత్తలు, సగటు ఉద్యోగితోపాటు సామాన్య ప్రజానీకం కూడా ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. తమ తమ రంగాలకు ఊరటనిచ్చే ప్రకటనల కోసం కోటి కలలతో ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునే ప్రకటన ఏమైనా ఉంటుందా.? మహహ్మారిపై పోరాడేందుకు నడుం బిగించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కష్టాలను తీర్చుతారా? రోజు కూలీల పరిస్థితి ఏంటి.? నిరుద్యోగుల సంగతేంటి.? సగటు ఉద్యోగికి ఏమేం అంశాల్లో మేలు జరగబోతోంది.? అనే అంశాలపై రోజూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రంగానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఈ కామర్స్ రంగానికి పండగలాంటి వార్త ఒకటి ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ కామర్స్ రంగం ఒకటి. లక్షలాది మంది ఈ రంగాల ద్వారా ఉపాధిని పొందుతున్నారు. వీటికి మరింత చేయూతనిస్తే మరికొన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కామర్స్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉత్పత్తులను ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సర్కారు ఆలోచిస్తోంది.
ప్రస్తుతం ఏదైనా ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేయడంతోపాటు ఎగుమతి, దిగుమతి చేసే ఉత్పత్తుల శాతాన్ని కూడా పెంచాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఒకేసారి భారీ సంఖ్యలో ఉత్పత్తుల దిగుమతికి అనుమతిస్తే, కస్టమర్లకు ట్రాన్సాక్షన్ వ్యయం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ కామర్స్ సంస్థలకు కూడా లాభదాయకంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఉత్పత్తులు పెరిగితే ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉందనీ, మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.