E CHALLANS TO VEHICLE DOCUMENTS CHANGES IN MOTOR VEHICLE RULES YOU SHOULD KNOW SK
Traffic Rules: మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు.. ఈ రూల్స్ తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
మోటార్ వాహనాల చట్టం-1989 నియమ నిబంధనల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మార్పులు చేసింది. అక్టోబరు 1 నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి....
ఇంటి నుంచి బైక్ లేదా కారును బయటికి తీస్తున్నామంటే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలి. ఇంతకుముందు ఫిజికల్ డాక్యుమెంట్లను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ డిజి లాకర్ వంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కేవలం సాఫ్ట్ కాపీలను చూపిస్తే సరిపోతుంది. ఐతే కొందరు ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాత్రం డిజిటల్ డాక్యుమెంట్స్ చూపించినప్పటికీ.. ఫిజికల్ డాక్యుమెంట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మోటార్ వాహనాల చట్టం-1989 నియమ నిబంధనల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మార్పులు చేసింది. అక్టోబరు 1 నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి....
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏవరైనా ట్రాఫిక్ అధికారి వాహనాన్ని ఆపి.. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డిజిటల్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్లను సదరు అధికారులు అడగకూడదు. ఒకవేళ అతడు ఏదైనా నేరం చేసినప్పటికీ ఫిజికల్ డాక్యుమెంట్లు డిమాండ్ చేయకూడదు.
ఎవరైనా వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సంబంధిత ట్రాఫిక్ అధికారి రద్దు చేస్తే ఆ వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆ రికార్డును ఎలక్ట్రానిక్ విధానంలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా డ్రైవర్ ప్రవర్తన తీరుపై పర్యవేక్షణ ఉంటుంది.
రోడ్డుపై ఏదైనా వాహనాన్ని ఆపి వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్స్‌ను తనిఖీ చేస్తే.. ఆ వాహన వివరాలతో పాటు తేదీ, సమయాన్ని సంబంధిత అధికారి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలి. తద్వారా వేరొక చోటకు వెళ్లినప్పుడు మళ్లీ ఇతర అధికారులు తనిఖీ చేసే అవసరం ఉండదు. అప్పుడు ట్రాఫిక్ సిబ్బంది సమయం వృథా కాదు. వాహనదారుడికీ ఇబ్బందులు తప్పుతాయి.
వాహనదారులు తమ వాహన పత్రాలనున కేంద్ర ప్రభుత్వ పోర్టల్ అయిన డిజి లాకర్ (Digi-locker) లేదా ఎం-పరివాహన్ (m-parivahan)లో నమోదు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సేవ్ చేసుకోవడం వల్ల ఫిజికల్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. రోడ్డుపై ఎవరైనా ట్రాఫిక్ అధికారులు ఆపి పత్రాలు అడితే.. ఆన్లైన్లో చూపిస్తే సరిపోతుంది.
వాహనాన్ని నడుపుతున్న సమయంలో కేవలం నేవిగేషన్ (రూట్ మ్యాప్) కోసమే మొబైల్ ఫోన్లను వినియోగించాల్సి ఉంటుంది. అది కూడా డ్రైవింగ్‌లో డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా ఉండకూడదు.
డ్రైవింగ్ సమయంలో చేతిలో ఉపయోగించే పరికరాలు, ఎలక్ట్రానిక్ రూపంలో వాహన పత్రాల పరిశీలనకు సంబంధించి Motor Vehicles (Driving) Regulations 2017లో కూడా పలు సవరణలు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.