హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

E-Auction Starts: ‘నమామి గంగే’ కోసం ప్రధాని మోదీ బహుమతులతో ఈ-వేలం.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

E-Auction Starts: ‘నమామి గంగే’ కోసం ప్రధాని మోదీ బహుమతులతో ఈ-వేలం.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

E-Auction Starts: ‘నమామి గంగే’ కోసం ప్రధాని మోదీ బహుమతులతో ఈ-వేలం.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

E-Auction Starts: ‘నమామి గంగే’ కోసం ప్రధాని మోదీ బహుమతులతో ఈ-వేలం.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

E-Auction Starts: ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో అందిన బహుమతులను వేలంలో విక్రయించనున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించింది. ఈ-వేలం నాలుగో ఎడిషన్ రెండు వారాల పాటు జరుగుతుంది. అక్టోబర్ 2న ముగుస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రధాని మోదీ (Indian PM Narendra Modi) కి వివిధ సందర్భాల్లో అందిన బహుమతులను వేలంలో విక్రయించనున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించింది. ఈ-వేలం నాలుగో ఎడిషన్ రెండు వారాల పాటు జరుగుతుంది. అక్టోబర్ 2న ముగుస్తుంది. వేలం ద్వారా సేకరించిన నిధులు గంగా నదిని పరిరక్షించడానికి ఉద్దేశించిన నమామి గంగే కార్యక్రమానికి వినియోగిస్తారు. సాధారణ ప్రజలు https://pmmementos.gov.inలో లాగిన్ చేసి నమోదు చేసుకోవడం ద్వారా ఈ-వేలంలో పాల్గొనవచ్చు.

* వేలంలో 1200 మెమెంటోలు

న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో మెమెంటోలు ఉన్నాయి. ఈ అంశాలను వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. ఈ సంవత్సరం సుమారు 1200 మెమెంటోలు, బహుమతులు వేలంలో భాగమయ్యాయి. వేలంలోని మెమెంటోల్లో సున్నితమైన పెయింటింగ్‌లు, శిల్పాలు, హస్తకళలు, జానపద కళాఖండాలు ఉన్నాయి. వీటిలో చాలా సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, తలపాగాలు, ఉత్సవ కత్తులు, బహుమతులుగా అందించే తర వస్తువులు ఉన్నాయి.

అయోధ్యలోని రామమందిరం, వారణాసిలోని కాశీ-విశ్వనాథ దేవాలయాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి. క్రీడలకు సంబంధింన మొమొంటోలు కూడా ఉన్నాయి. ప్రదర్శన ప్రాంతం ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రవేశం అందరికీ ఉచితమని నిర్వాహకులు చెప్పారు. సందర్శనను మరింత ఆనందదాయకంగా మార్చేందుకు, సాధారణంగా గైడెడ్ టూర్లు, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక గైడెడ్ టూర్లు ఏర్పాటు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం బ్రెయిలీలో కేటలాగ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

* ప్రధాన ఆకర్షణగా క్రీడా వస్తువులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బహుమతిగా ఇచ్చిన రాణి కమలపతి విగ్రహం, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహుమతిగా ఇచ్చిన హనుమాన్ విగ్రహం, సూర్యుడి పెయింటింగ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ బహుమతిగా ఇచ్చిన త్రిశూలం వేలంలో ఉన్నాయి. అదే విధంగా NCP నాయకుడు అజిత్ పవార్ ఇచ్చిన కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి దేవి విగ్రహం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కానుకగా ఇచ్చిన వేంకటేశ్వరస్వామి పటం వేలంలో సొంతం చేసుకోవచ్చు.

ఇది కూాడా చదవండి : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత ప్రధానిని పొగుడుతున్న ప్రపంచ మీడియా..

కామన్వెల్త్ గేమ్స్ 2022, డెఫ్లింపిక్స్ 2022, థామస్ కప్ ఛాంపియన్‌షిప్ 2022లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసి పతకాలు గెలుచుకున్నారు. ఆయా క్రీడా ఈవెంట్లలో జట్లు, క్రీడాకారులకు అందిన జ్ఞాపికలు కూడా ఈ-వేలంలో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా క్రీడాకారులు సంతకం చేసిన టీ-షర్టులు, బాక్సింగ్ గ్లోవ్‌లు, జావెలిన్, రాకెట్లు వంటి క్రీడా వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

* కానుకలను వేలం నిర్వహిస్తున్న తొలి ప్రధాని

దీనికి సంబంధించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌లో.. సమయం వచ్చింది! ఇది ఉదయం 10 గంటలు, పీఎం మెమెంటోస్ వేలం 2022 ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్న ప్రత్యేక బహుమతుల వేలంలో పాల్గొనేందుకు https://pmmementos.gov.inలో రిజిస్టర్‌ చేసుకోండని పేర్కొన్నారు. నమామి గంగ ద్వారా దేశ జీవనాధారమైన గంగానదిని పరిరక్షించాలనే లక్ష్యంతో తనకు అందిన కానుకలన్నీ వేలం వేయాలని నిర్ణయించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Kishan Reddy, Narendra Modi Birthday, National News, PM Narendra Modi

ఉత్తమ కథలు