Home /News /national /

DUSSEHRA 2020 RAJNATH SINGH PERFORMS SHASTRA PUJA IN DARJEELING PAYS TRIBUTE TO SOLDIERS AT CHINA BORDER NK

Dussehra 2020: ఇండియా జోలికొస్తే... ఆయుధ పూజలో రాజ్‌నాథ్ సింగ్... చైనాకు హెచ్చరికలు

ఇండియా జోలికొస్తే... ఆయుధ పూజలో రాజ్‌నాథ్ సింగ్... చైనాకు హెచ్చరికలు (credit - twitter - ANI)

ఇండియా జోలికొస్తే... ఆయుధ పూజలో రాజ్‌నాథ్ సింగ్... చైనాకు హెచ్చరికలు (credit - twitter - ANI)

Dussehra 2020: దసరా నాడు ఆయుధ పూజ చెయ్యడం మన ఆనవాయితీ. రక్షణ శాఖ మంత్రిగా ఆయుధ పూజ చేసిన రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు చైనాకు షాక్ అనే చెప్పాలి.

    Dussehra 2020: విజయ దశమి సందర్భంగా... కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... పశ్చిమ బెంగాల్... డార్జిలింగ్ లోని సుక్నా వార్ మెమొరియల్ దగ్గర ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన... చైనాతో ఆ మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణల్లో అమరులైన భారత సైనికులకు నివాళులు అర్పించారు. భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. బెంగాల్, సిక్కింలో సైనిక సన్నద్ధతపై సమీక్ష జరిపేందుకు రెండ్రోజుల పర్యటనకు బెంగాల్ వెళ్లిన రాజ్‌నాథ్... అక్కడ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరావానేను కలిశారు. ఈ సందర్భంగా... ఇండియా నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా ఎవ్వర్నీ తీసుకోనివ్వం అని రాజ్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు.

    "ఇండియా-చైనా సరిహద్దు వెంట టెన్షన్లు పోయి... శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. అదే సమయంలో... మన ఆర్మీ... ఒక్క అంగుళం భూమిని కూడా కోల్పోనివ్వరనే నమ్మకం నాకు ఉంది" అని రాజ్‌నాథ్ అన్నారు.


    శనివారం... సుక్నాలో.... త్రిశక్తి దళం అని పిలిచే... ఇండియన్ ఆర్మీకి చెందిన 33 కార్ప్స్ లోని సైనిక బృందం ముందు రాజ్‌ నాథ్ ప్రసంగించారు. "భారత్ ఎల్లప్పుడు సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటోంది. కానీ కాలానుగుణంగా కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో దేశం సార్వభౌమత్వం, ప్రాంతాలవారీ ఐకమత్యం కోసం మన సైనికులు ప్రాణ త్యాగం చేస్తుంటారు" అన్నారు. జూన్ 15న తూర్పు లఢక్ లోని గాల్వాన్ లోయలో... చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

    గతేడాది ఫ్రాన్స్ ఓడరేవు నగరం బోర్డియాక్స్‌లో ఇండియా... దసరా ఆయుధ పూజను జరిపింది. అప్పట్లో ఆ దేశ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్... అక్కడే అలా చేశారు. రాజ్‌నాథ్ ఇదివరకు కూడా చాలాసార్లు శస్త్ర పూజ చేశారు. గత NDA ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశారు.


    ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత అలాగే ఉంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. అందువల్ల వాస్తవాధీన రేఖ వెంట... ఇండియన్ ఆర్మీకి హై లెవెల్ అలర్ట్ ఉంది. భారత్-చైనా మధ్య వరుసగా దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. కానీ... డ్రాగన్.. ఓవైపు స్నేహ హస్తం అందిస్తున్నట్లు డ్రామాలాడుతూ... సరిహద్దుల్లో గోతులు తీస్తూనే ఉంది. అందుకే.. అలాంటి దేశంతో అలర్ట్ గా ఉండటమే మంచిదని గ్రహించిన భారత్... శాంతిప్రక్రియ కొనసాగిస్తూనే... సరిహద్దుల్లో కూడా సమరానికి సన్నద్ధంగా ఉంటోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Dussehra 2020, Navaratri 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు