news18-telugu
Updated: October 8, 2019, 6:36 AM IST
మోహన్ భగవత్(File Photos)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నేటి ఉదయం 7.40కి నాగపూర్ విజయదశమి ఉత్సవం నిర్వహించబోతోంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. 1925లో ఇదే విజయదశమి రోజున RSS స్థాపన జరిగింది. అప్పటి నుంచీ ఏటా ఈ పండుగను సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. RSS చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈ ఏడాది HCL అధ్యక్షుడు శివ నాడార్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను RSS తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ అవుతుందని వివరించింది.
శివ నాడార్ ఎవరు :
శివనాడార్ ఓ పారిశ్రామిక వేత్త మాత్రమే కాదు... ఆయన చాలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శివనాడార్ ఫౌండేషన్ స్థాపించారు. అందువల్ల ఆయన్ను ప్రధాన అతిథిగా ఆహ్వానించింది ఆర్ఎస్ఎస్.ఈ కార్యక్రమానికి గతేడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పట్లో అది రాజకీయ దుమారం రేపింది. ఆయన వెళ్లడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది.
ఇవి కూడా చదవండి :
కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి... నేడు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనం
Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...
Health Tips : డైటింగ్, ఎక్సర్సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే
Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి
Published by:
Krishna Kumar N
First published:
October 8, 2019, 6:33 AM IST