DURGA PUJA ON THE LIST OF INTANGIBLE CULTURAL HERITAGE UNESCO KNOW DETAILS EVK
Durga Puja: 'ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్' జాబితాలో దుర్గాపూజ.. యునెస్కో ప్రకటన
దుర్గా దేవి
UNESCO: దుర్గా పూజను పండుగ కంటే ఒక భావోద్వేగంగా భావిస్తారు బెంగాళీలు. దుర్గా పూజ ప్రపంచలో అనేక ప్రాంతాల్లో ఎంతో విశిష్టంగా జరుపుకొంటారు. ఈ దుర్గా పూజను యూనెస్కో వారసత్వ గుర్తింపును ఇచ్చింది. ఈ విషయాన్ని యునెస్కో ట్విట్టర్ అధికారిక ఖాతలో వెల్లడించింది.
దుర్గా పూజను పండుగ కంటే ఒక భావోద్వేగంగా భావిస్తారు బెంగాళీలు. దుర్గా పూజ (Durga Puja) ప్రపంచలో అనేక ప్రాంతాల్లో ఎంతో విశిష్టంగా జరుపుకొంటారు. ఈ దుర్గా పూజను యూనెస్కో వారసత్వ గుర్తింపును ఇచ్చింది. ఈ విషయాన్ని యూఎస్కో ట్విట్టర్ అధికారిక ఖాతలో వెల్లడించింది. కోలక్‌కత్తాలోని దుర్గాపూజ ప్రపంచానికి వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 13, నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే 16వ సెషన్ సమావేశాల్లో నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయంపై యూనెస్కో న్యూఢిల్లీ డైరెక్టర్ ఎరిక్ ఫాల్ట్ మాట్లాడారు. భారతీయులకు, ముఖ్యంగా నామినేషన్ వేసిన వారందరికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో విశిష్ఠంగా సాగుతుందని నృత్యాలు, ఆరాధన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గుర్తింపు ద్వారా సంప్రదాయ కళాకారులు, డిజైనర్లు, కళాకారులు, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు, అలాగే పర్యాటకులు మరియు సందర్శకులకు ప్రోత్సాహం లభిస్తుందని విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.
దేశంలో ఎక్కువ మంది ఆచరించే ప్రదర్శన కళలు, సామాజిక పద్ధతులు, ఆచారాలు, పండుగ సంఘటనలు, ప్రకృతి మరియు విశ్వానికి సంబంధించిన అంశాలను యునెస్కో గుర్తింపు నిస్తుంది.
దాని ద్వారా వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను అందిస్తుంది.. దేశంలో అనేక శతాబ్దాలుగా జరుపుకునే పురాతన పండుగ దుర్గాపూజ ఈ జాబితాలో చోటు సంపాదించింది. మొత్తంగా, దేశం నుంచి 14 సాంస్కృతిక వారసత్వ అంశాలు ఇప్పుడు UNESCO యొక్క జాబితాలో చేర్చారు.
విద్యా ప్రమాణాలు మెరుగు పడ్డాయి..
విద్యాప్రమాణాలు పాటించడంలో భారత్ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లో యూనిసెఫ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. భారత్లో 15-24 ఏళ్ల వయోవర్గం లో 73 శాతం మం ది విద్యా నాణ్య త మెరుగుపడిం దని భావిస్తుం డగా, వారిలో 57 శాతం మంది జీవితంలో
విజయానికి విద్య కీలకమని పేర్కొన్నట్టు యూనిసెఫ్ (UNICEF) తెలిపింది. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదం డ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని వెల్లడించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.