ఆప్ఘనిస్థాన్‌ గగనతలం మూసివేత.. అక్కడే చిక్కుకుపోయిన భారతీయులు

ఆప్ఘనిస్థాన్‌ గగనతలం మూసివేత (image credit - reuters)

తాలిబన్లను అస్సలు నమ్మలేం. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంటామని చెప్పే ఆ ఉగ్రమూకలు ఏ క్షణమైనా విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అందుకే ఆప్ఘనిస్థాన్‌లో భారతీయుల్ని త్వరగా తరలించే ప్రక్రియ జరుగుతోంది.

 • Share this:
  ఎప్పుడు చూసినా చేతిలో ఆయుధాలు, మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో తిరిగే తాలిబన్ల చేతిలో ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ అనే దేశం చిక్కుకుంది. ఇక వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యింది. కాబట్టి అలాంటి నరక కూపంలో ఉండటం ఏ దేశ ప్రజలకూ మంచిది కాదు. అందుకే... అన్ని దేశాల ప్రజలూ... పెట్టే బెడా సర్దుకొని... స్వదేశాలకు ఫ్లైటెక్కేస్తున్నారు. ఇండియన్స్ కూడా త్వరగా ఇండియా వచ్చేసేందుకు పోటీ పడుతున్నారు. ఐతే... ఎయిర్ ఇండియా ఓ షాకింగ్ విషయం చెప్పింది. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ గగనతలాన్ని (Air space)ను మూసివేశారనీ... అందువల్ల ఆ దేశం మీదుగా విమానాల్ని నడిపే పరిస్థితి లేదని తెలిపింది.

  ఆఫ్ఘనిస్థాన్‌లో వందల మంది భారతీయ అధికారులు ఉన్నారు. వారిని అక్కడి రాజధాని కాబూల్ నుంచి ఇండియా తెచ్చేందుకు ఎయిర్ ఇండియా ప్రయత్నిస్తోంది. తాము విదేశాంగ శాఖ, ఎయిర్ ఇండియా, ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలతో టచ్‌లో ఉంటూ... భారతీయుల్ని క్షేమంగా ఇండియా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు.


  అసలు ఇప్పుడు ఆప్ఘనిస్థాన్‌ పరిస్థితి చూస్తే ప్రపంచం అంతమైపోతున్నప్పుడు ప్రజలు ఎలా టెన్షన్ పడతారో అలా ఉంది. ఆదివారం... తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించారనే వార్త రాగానే... ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి పరుగెత్తుకొచ్చి... షాపుల్లో సామాన్లన్నీ పట్టుకుపోయారు. బ్యాంకుల్లో డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. ఏటీఎంలు గంటల్లో ఖాళీ అయిపోయాయి. అంతా అల్లకల్లోలం అయిపోయింది.

  ఇక సాయంత్రం నుంచి మరో సీన్. ప్రజలు రాజధాని కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు పెద్ద సంఖ్యలో బయల్దేరారు. అంత మంది వచ్చేసరికి వాళ్లను ఆపడం అక్కడి సెక్యూరిటీకి సాధ్యం కాలేదు. ప్రజలు ఎయిర్‌పోర్టులోని రన్‌వే పైకి పరుగులు పెడుతూ వెళ్లి... విమానాలు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ తమ తమ పౌరుల్ని తరలించడానికి కాబూల్‌కి విమానాలను పంపుతున్నాయి. దాంతో... కాబూల్ ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం ఉంది. అందుకే... గగనతలాన్ని మూసివేశారు. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ మీదుగా వెళ్లే విమానాలన్నీ... రూట్ మార్చుకొని... వేరే రూట్లలో వెళ్తున్నాయి.


  ఇండియాకి సంబంధించి... ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ కాబూల్‌లో ఉంది. ఎయిర్ ఇండియా విమానాల్లో భారతీయుల్ని తరలించడం కుదరకపోతే... ఈ యుద్ధ విమానం ద్వారా తరలిస్తారు. కానీ ఇప్పుడు గగనతలాన్ని మూసివేయడం వల్ల... ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా సేవల్ని నిలిపివేయాల్సి వచ్చింది.

  ఇది కూడా చదవండి: Zero Rupee note: జీరో రూపీ నోట్ అంటే ఏంటి? ఎలా వాడాలి?

  నిన్న ఎయిర్ ఇండియా... విమానంలో ఆప్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులు... ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఇవాళ మరో విమానం అక్కడి నుంచి ఉదయం బయలుదేరాలి కానీ ఆగిపోయింది.
  Published by:Krishna Kumar N
  First published: