హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Heavy Rains: అక్కడ భయపెడుతున్న భారీ వర్షాలు .. 23జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

Heavy Rains: అక్కడ భయపెడుతున్న భారీ వర్షాలు .. 23జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tamilnadu | Rains: భారీ వర్షాలతో మరోసారి తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా వర్షప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Chennai, India

భారీ వర్షాలతో మరోసారి తమిళనాడుTamilnadu చిగురుటాకులా వణికిపోతోంది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా వర్షప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలు(Schools), కాలేజీల(Colleges)తో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. గురువారం(Thursday)రాత్రి కురిసిన భారీ వర్షానికి చెన్నై(Chennai) నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వాతావరశాఖ(Department of Meteorology)హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం శుక్ర, శనివారాలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.

Karnataka: ఆర్టీసీ బస్‌లో ల్యాప్‌టాప్ తీసుకెళ్తున్నాడని లగేజీ ఛార్జీ 10రూపాయలు వసూలు .. ఎక్కడంటే..?

భయపెడుతున్న భారీ వర్షాలు..

తమిళనాడును వర్షాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి చెన్నై మహానగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్ష ప్రభావం మరో రెండ్రోజులు ఉండనుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో తమిళనాడులోని 23జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీలకు సెలవు దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం. ప్రధానంగా విల్లుపురం, రామనాధపురం,తిరువణ్ణామలై, తిరుచ్చి, కడలూరు, పుదుకోట్టె, పెరంబులూరు, అరియలూరు, కళ్కురిచ్చి జిల్లాల్లోని అధికార యంత్రాంగం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చెరి, కారైకల్‌లో శుక్ర, శనివారాలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు.

జలమయం..

గురువారం రాత్రి కురిసిన వర్షానికి చెన్నైలోని అయ్యంపంతంగల్, పులియంతోప్, వ్యాసర్‌పాడి ప్రాంతాల్లోని రోడ్లు చెరువుల్లా మారాయి. తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం జిల్లాలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే మధురై, శివగంగా జిల్లాల కలెక్టర్‌లు సెలవు దినాలను ప్రకటించారు.

స్కూల్స్, కాలేజీలు బంద్..

తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, కడలూరు, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్టినం జిల్లాలు, పుదుచ్చేరి , కారైకాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ..ఆయా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.

రెండ్రోజుల పాటు ..

తమిళనాడులోని ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, పుదుక్కోట్టై, శివగంగ, రామనాథపురం, విరుదునగర్, మదురై, తేని, దిండిగల్, తిరుప్పూర్, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది.

First published:

Tags: Heavy Rains, IMD, Tamil nadu