సెప్టెంబర్ వరకూ పేదలకు ఉచిత బియ్యం? కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఇదీ...

దేశంలో కరోనా రాగానే పేదలకు ఉచిత బియ్యం, కందిపప్పు, శనగల వంటి వాటిని కేంద్రం ఉచితంగా ఇచ్చింది. వాటిని మరో మూడు నెలలు పొడిగించనుందా?

news18-telugu
Updated: June 30, 2020, 8:51 AM IST
సెప్టెంబర్ వరకూ పేదలకు ఉచిత బియ్యం? కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఇదీ...
సెప్టెంబర్ వరకూ పేదలకు ఉచిత బియ్యం? కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఇదీ... (File)
  • Share this:
దేశంలో కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది పేద, మధ్యతరగతి ప్రజలే. చేయడానికి పని లేక చాలా మంది కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రబుత్వం ఉచిత బియ్యం, కందిపప్పు వంటి వాటిని మూడు నెలలుగా అందిస్తోంది. ఐతే... ఇప్పుడు కరోనా తగ్గకపోవడం, కేసులు మరింత పెరుగుతూ... చాలా మంది స్వచ్ఛందంగా షాపులు మూసేస్తుండటంతో... పేదల్ని మరో మూడు నెలలు ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో వచ్చే మూడేళ్లకి సరిపడా ఆహార ధాన్యాలు గోడౌన్లలో ఉన్నాయి కాబట్టి... ఏప్రిల్, మే, జూన్‌లో ఇచ్చినట్లే మరో మూడు నెలలు ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్రం రెండ్రోజుల్లో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కరోనా సమయంలో... ఇప్పటికే రెండు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారుల కోసం ఏప్రిల్‌ నుంచి మూడు నెలల పాటు నెలకి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు చొప్పున ఉచితంగా ఇచ్చింది. కందిపప్పు వాడని వారికి శనగలు ఇచ్చింది. ఈ ఉచిత స్కీం జూన్‌తో ముగిసినట్లే. మరి జులైలోనూ కరోనా ఎక్కువగానే ఉండేలా ఉంది కాబట్టి... కేంద్రం అన్‌లాక్ 2 తెచ్చినా పేదల జీవితాలు మెరుగయ్యే అవకాశాలు కనిపించటలేదు. పని దొరకట్లేదు. పైగా... కరోనా కేసులు పెరుగుతూ... పనికి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఎవరైనా తెగించి పనులకు వెళ్తే... కరోనా బారిన పడుతున్నారు.

మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మిజోరం, పుదుచ్చేరి, కేరళ, పంజాబ్, అసోం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు.. ఉచిత బియ్యం, కందిపప్పు మరో మూడు నెలలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాయి. అలా చెయ్యాలంటే కేంద్రంపై మరో రూ.46 వేల కోట్ల భారం పడుతుంది. అందుకే కేంద్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ మరో సమస్య రాష్ట్రాల నుంచి ఉంది. కేంద్రం ఆయా రాష్ట్రాల్లో ఉన్న అందరు లబ్దిదారులకూ బియ్యాన్ని ఇవ్వట్లేదు. కేంద్రంతోపాటూ రాష్ట్రాలు అదనంగా మరికొంత మందికి వాటిని ఇస్తున్నాయి. తెలంగాణనే తీసుకుంటే... ఇక్కడ 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే... కేంద్రం 1.91 కోట్ల మందికి మాత్రమే బియ్యం ఇస్తోంది. మిగతా వారికి రాష్ట్రం ఇస్తోంది. అందువల్ల కేంద్రం ప్రకటన రాగానే... రాష్ట్రాలు కూడా ఆలోచించుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి.
First published: June 30, 2020, 8:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading