హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Climate Change: జామపండ్లపై వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక, ఆ రకం జామ పండ్లను తినలేమా..?

Climate Change: జామపండ్లపై వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక, ఆ రకం జామ పండ్లను తినలేమా..?

జామపండు తిన్న తర్వాత తరచుగా కడుపులో నొప్పి వస్తుంది. దీనికి కారణం జామ గింజలు. జామపండును సరైన పద్ధతిలో తింటే కడుపునొప్పి రాదు. అలాగే  పోషకాలతో పాటు పీచుతో కూడిన జామపండును తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

జామపండు తిన్న తర్వాత తరచుగా కడుపులో నొప్పి వస్తుంది. దీనికి కారణం జామ గింజలు. జామపండును సరైన పద్ధతిలో తింటే కడుపునొప్పి రాదు. అలాగే పోషకాలతో పాటు పీచుతో కూడిన జామపండును తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

Climate Change: రైతులు వేసవిలో (మే-జూన్ మధ్య కాలం) యూరియా ఉపయోగించి పండ్లు పూత వేసేలా చూసుకోవాలన్నారు. వర్షాకాలంలో చెట్లకు పండ్లు కాయకపోతే.. అవి శీతాకాలంలో మంచి నాణ్యతతో కాస్తాయన్నారు.

భారతదేశంలో పండే అన్ని జామకాయల్లో కెల్లా ప్రయాగ్‌రాజ్‌, కౌశాంబి (Kaushambi) పింక్ జామ పండ్లను చాలామంది ఇష్టపడుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువగా పండే ఈ జామ పండ్లను కోస్తే మధ్యలో గులాబీ రంగు గుజ్జు ఉంటుంది. ఎందరికో ఇష్టమైన ఈ రుచికరమైన పండ్లు ఇప్పుడు దొరకడం గగనమే! ఎందుకంటే ఈసారి అధిక వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రసిద్ధమైన ‘పింక్ కలర్’ జామ పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. ఈ గులాబీ రంగు జామపండ్లు దొరికినా.. వాటి రుచి మునుపటిలా మధురంగా ఉండటం లేదు. భారీ వర్షపాతం కారణంగా ప్రయాగ్‌రాజ్‌, కౌశాంబి జిల్లాల్లోని ఫేమస్ జామ సాగు ప్రాంతంలో జామ చెట్లు ఈ ఏడాది చాలా త్వరగా పూత వేశాయి. పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యత లోపిస్తోంది. ఈ విషయాన్ని ఖుస్రో బాగ్‌లోని హార్టికల్చర్, ఎక్స్‌పెరిమెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (హెచ్‌ఈటీసీ) ఇన్‌ఛార్జి విజయ్ కిషోర్ సింగ్ తాజాగా తెలిపారు.

"లాల్ సుర్ఖా(Lal Surkha) రకం జామపండ్లలోని ఎరుపు రంగు జామ ఇప్పుడు అంత గొప్పగా ఏం లేదు. బాగా ప్రఖ్యాతి చెందిన అలహాబాద్ జామ పండ్లైన 'సుర్ఖా', 'సఫేదా(Safeda)' రకాలు గత నాలుగేళ్లుగా పండటం లేదు. అందువల్ల ధరల గణనీయంగా పెరుగుతున్నాయి. జామ చెట్లు అక్టోబర్ చివరి నాటికి పూత పూయడం ప్రారంభించాలి. అలా అయితేనే పండ్లు డిసెంబర్ మధ్య నాటికి పక్వానికి వస్తాయి. తీవ్రమైన పొగమంచు, చలికాలం కారణంగా, డిసెంబరు మధ్య నుంచి జనవరి మధ్య వరకు పండ్లు ఎరుపు రంగును పొందుతాయి." అని విజయ్ కిషోర్ సింగ్ వివరించారు.

రైతులు వేసవిలో (మే-జూన్ మధ్య కాలం) యూరియా ఉపయోగించి పండ్లు పూత వేసేలా చూసుకోవాలన్నారు. వర్షాకాలంలో చెట్లకు పండ్లు కాయకపోతే.. అవి శీతాకాలంలో మంచి నాణ్యతతో కాస్తాయన్నారు. ఇవేమి చెక్ చేసుకోకుండా.. పంటలు పండకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణమని ఇప్పుడు మళ్లీ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారన్నారు.

ఇది కూడా చదవండి :  శీతాకాలంలో ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కావాలా..? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే..

"ప్రభుత్వ అధికారులు ఎవరూ మా పొలాలను సందర్శించలేదు. మా పంటను కాపాడుకోవడానికి లేదా నాణ్యమైన పంటను పొందడానికి ఏ పద్ధతులను అనుసరించాలో మాకు శిక్షణ ఇవ్వలేదు. అందువల్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'లాల్ సుర్ఖా', సఫేదా రైతులు లాభాలను పొందలేకపోయారు" అని అలహాబాద్ సుర్ఖా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు ఇంద్రజీత్ సింగ్ పటేల్ అన్నారు. ఈ ప్రాంతంలోని అనేక మంది జామ సాగుదారులు ఇప్పుడు జీవనోపాధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

First published:

Tags: Fruits, Life Style, WEATHER

ఉత్తమ కథలు