హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఐపీఎల్ ప్రారంభం వేళ ఎయిర్ ఇండియాకు షాకిచ్చిన దుబాయ్

ఐపీఎల్ ప్రారంభం వేళ ఎయిర్ ఇండియాకు షాకిచ్చిన దుబాయ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విమానంలో ప్రయాణించిన వారిని క్వారంటైన్ చేసేందుకు అవసరమైన ఖర్చును కూడా ఎయిర్ ఇండియానే భరించాలని తెలిపింది. వైద్య సేవలు, క్వారంటైన్ వసతికి తాము ఖర్చుచేసిన డబ్బును చెల్లించాలని స్పష్టం చేసింది.

  రేపటి నుంచి ఐపీఎల్ సందడి మొదలు కాబోతోంది. యూఏఈ వేదిగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. ఐతే అంతకు ఒక్క రోజు ముందు ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ బిగ్ షాకిచ్చింది. దుబాయ్, ఇండియా మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల రాకపోకలను నిలిపివేసింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా రోగిని విమానంలోకి అనుమతించి.. దుబాయ్‌కి తీసుకువచ్చారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. మీ నిర్లక్ష్యం కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ మండిపడింది.

  విమానంలో ప్రయాణించి ఆ వ్యక్తికి సెప్టెంబరు 2న కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు జైపూర్‌లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ రిపోర్టు ఇచ్చింది. ఐతే సెప్టెంబర్ 4న అతడు జైపూర్ నుంచి దుబాయ్‌కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX1135లో ప్రయాణించాడు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అతడికి కరోనా ఉన్న విషయం ఎయిర్‌పోర్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు లేఖ రాసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడి వల్ల మిగతా ప్రయాణికుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని విమర్శిస్తూ.. విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధించింది.

  అంతేకాదు ఆ విమానంలో ప్రయాణించిన వారిని క్వారంటైన్ చేసేందుకు అవసరమైన ఖర్చును కూడా ఎయిర్ ఇండియానే భరించాలని తెలిపింది. వైద్య సేవలు, క్వారంటైన్ వసతికి తాము ఖర్చుచేసిన డబ్బును చెల్లించాలని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో సవివరంగా కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని సూచింది. అప్పుడే విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని తెగేసి చెప్పింది దుబాయ్ ఏవియేషన్. కాగా, కరోనా రోగులు తరలించారనే ఆరోపణలతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై సస్పెన్షన్ వేటుపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు హాంగ్ కాంగ్ కూడా కొన్ని రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Air India, Coronavirus, Covid-19, Dubai

  ఉత్తమ కథలు