టెర్రరిస్టులతో చేతులు కలిపిన పోలీస్ అధికారి.. కారులో వెళ్తూ..

కొన్ని రోజులుగా డీఎస్పీ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్‌లో అనుమానముంది. ఈ క్రమంలోనే శనివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

news18-telugu
Updated: January 13, 2020, 10:40 PM IST
టెర్రరిస్టులతో చేతులు కలిపిన పోలీస్ అధికారి.. కారులో వెళ్తూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపడం సర్వ సాధారణమే. అలాంటి ఉగ్రవాదులను కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు అరెస్ట్ చేస్తుంటాయి. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేస్తుంటారు. టెర్రరిస్టుల నుంచి దేశ ప్రజలకు రక్షణ ఇస్తుంటారు. ఐతే అలాంటి పోలీస్ శాఖలో డ్యూటీ చేస్తున్న ఓ అధికారి టెర్రరిస్టులతో చేతులు కలపడం సంచలనంగా మారింది. ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులతో కలిసి ప్రయాణిస్తున్న పోలీసును భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. శనివారం సాయంత్రం షోపియాన్‌లో ఈ ఘటన జరిగింది.

జమ్మూ కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం షోపియన్‌లో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. రోడ్డుపై తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరే తోయిబాకు చెందిన మరో ఉగ్రవాది కనిపించారు. వారి పక్కనే దవీందర్ సింగ్ అనే డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి ఉన్నాడు. నలుగురూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించారు. ఐతే పోలీసులకు లొంగిపోవాలని టెర్రరిస్టులను నచ్చజెబుతున్నానని.. అంతేతప్ప వారితో చేతులు కలపలేదని దవీందర్ సింగ్ తెలిపాడు. ఐతే ఉగ్రవాదులను ప్రత్యేకంగా విచారించిన అధికారులు.. వారి మధ్య సరెండర్ గురించి చర్చ జరగలేదని గుర్తించారు. ఉగ్రవాదులతో డీఎస్పీకి సంబంధాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు. నలుగురం కలిసి జమ్మూలోని ఓ క్యాంప్‌కు వెళ్తున్నామని పోలీసులకు చెప్పారు. కొన్ని రోజులుగా డీఎస్పీ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్‌లో అనుమానముంది. ఈ క్రమంలోనే శనివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు