DRUNKEN MAN RELISHES DOSA SITTING IN MIDDLE OF ROAD IN BENGALURU PVN
Drunken Man : రియల్ ఉపేంద్ర..రోడ్డు మధ్యలో కూర్చొని బ్రేక్ ఫాస్ట్
రోడ్డు మధ్యలో కూర్చొని దేశె తిన్న వ్యక్తి
Drunken man relishes dosa on road : తీవ్రమైన ట్రాఫిక్ అవాంతరాలకు బెంగళూరు నిలయం. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో 1500కు పైగా బహుళజాతి(మల్టీ నేషనల్) సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కొరత, వాహనాల కొనుగోళ్లు పెరిగిపోతుండటం వల్ల కర్నాటక రాజధానిలో ట్రాఫిక్ సమస్య ఇక్కడ చాలా తీవ్రంగా ఉంటది.
Drunken man relishes dosa on road : తీవ్రమైన ట్రాఫిక్ అవాంతరాలకు బెంగళూరు(Bengaluru) నిలయం. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో 1500కు పైగా బహుళజాతి(మల్టీ నేషనల్) సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కొరత, వాహనాల కొనుగోళ్లు పెరిగిపోతుండటం వల్ల కర్నాటక రాజధానిలో ట్రాఫిక్ సమస్య ఇక్కడ చాలా తీవ్రంగా ఉంటది. ఐటీ సంస్థల కేంద్రమైన ఎలక్ట్రానిక్ సిటీకి దారితీసే సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద నిత్యం ఐటీ ఉద్యోగులు వందల మంది ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుంటారు. ఇక్కడ సిగ్నల్ దాటడానికే 25 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. ఒక్కోసారి అరగంటకు పైనే పడుతుంది. అలాంటి బెంగళూరులో తాజాగా ఓ తాగుబోతు చేసిన పనికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఉదయాన్నే ఫుల్ గా మద్యం సేవించిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బసవేశ్వర నగర్లో శనివారం ఉదయం రోడ్డుపై కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. దోశ, వాటర్ బాటిల్‌తో రోడ్డు మధ్యలో కూర్చుని.. పక్క నుంచి వెళ్లాలంటూ వాహనదారులకు సూచనలు చేశాడు. నడిరోడ్డుపై ఇతడ్ని ఒక్కసారిగా చూసి వాహనదారులు షాక్ అయ్యారు. నడి రోడ్డు మీద ఇతను బ్రేక్ ఫాస్ట్ చేయడాన్ని చూసిన కొందరికి..అప్పుడెప్పుడో రిలీజ్ అయిన నేను అనే పేరుతో విడుదలైన ఉపేంద్ర నటించిన సినిమా గుర్తుకొచ్చింది. వీడెవడో రియల్ ఉపేంద్రలాగా ఉన్నాడంటూ అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అయితే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మందుబాబు పక్కకు వెళ్లినట్లు సమాచారం.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.