• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DRUG 2 DG WHAT IS DRUG 2 DG HOW IT WORKS ON COVID 19 PATIENTS WHY DCGI GRANTED PERMISSION TO IT HERE IS THE FULL DETAILS NK

DRDO Drug 2-DG: కరోనాకు అదిరిపోయే మందు... ఎలా పనిచేస్తోందంటే...

DRDO Drug 2-DG: కరోనాకు అదిరిపోయే మందు... ఎలా పనిచేస్తోందంటే...

DRDO Drug 2-DG: కరోనాకు అదిరిపోయే మందు... ఎలా పనిచేస్తోందంటే... (image credit - twitter)

DRDO Drug 2-DG: డీఆర్డీఓ తయారుచేసిన ఈ మందు... కరోనాపై బాగా పనిచేస్తోంది. దీనికి అనుమతి కూడా వచ్చేసింది. మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

  • Share this:
    DRDO Drug 2-DG: కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఓ పొడిని తయారుచేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని... భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చింది. DRDO చాలా పెద్దది కదా... అందులో... న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలీడ్ సైన్సెస్ (INMAS) అనే సంస్థ ఒకటి ఉంది. అదే... ఓ ల్యాబులో ఈ పొడిని తయారుచేసింది. ఇందుకు హైదరాబాద్‌లని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2-DG (2-డియోక్సీ-D-గ్లూకోజ్). ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు... మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. ఇలా ఇది మంచి ఫలితాలు ఇస్తోంది.

    ఇది అన్ని మందుల లాంటిది కాదు. అసలు దీన్ని తయారుచేసిన విధానమే ప్రత్యేకంగా ఉంది. రిపోర్టుల ప్రకారం... ఈ పొడి... కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే... అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే... కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి... బాగవుతాయి. పేషెంట్లు రికవరీ అయ్యి కోలుకుంటారు.


    మొదటి, రెండు ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలతో... DCGI ఈ మందుకి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు కూడా ఎమర్జెన్సీ వాడకం అనుమతులే ఉన్నాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తై... రిపోర్ట్ వస్తే... ఈ డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది.


    ఈ మందు తయారీదారులు చెబుతున్నదేంటంటే... ఈ మందు... పాడైన కణాలను మాత్రమే ఎంచుకుంటుందట. అక్కడే ప్రభావం చూపుతుందట. మరి ఈ మందు ఇతర కణాలపైనా ప్రభావం చూపుతుందా అనేది తేలాల్సి ఉంది. సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా అనేది తేలాలంటే... మూడో దశ ట్రయల్స్ పూర్తవ్వాల్సి ఉంటుంది.


    కరోనా లక్షణాలు స్వల్పంగా, తీవ్రంగా ఉన్న వారికి ఈ మందును ఇచ్చారు. రికవరీ ఎక్కువగానే ఉండొచ్చను అని అంచనా వేశారు. మూడో దశ తర్వాత... సైడ్ ఎఫెక్టులు రాకపోతే... అప్పుడు ఇది కరోనా పేషెంట్లకు బాగా ఉపయోగపడగలదని అంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న యాంటీ వైరల్ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్ వంటివి... పాడైన కణాలనే కాక... ఇతర కణాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఐతే... అందువల్ల కలిగే నష్టం కంటే... ప్రయోజనాలే ఎక్కువగా ఉంటున్నాయి. 2-DGని యాంటీవైరల్ డ్రగ్ అని అనలేం. ఎందుకంటే... ఇది వైరస్‌ని చంపదు. దానికి ఆహారం రాకుండా చేస్తుందంతే.

    ఇది కూడా చదవండి: Anti-Inflammatory Foods: శరీరంలో వేడి పెరుగుతోందా... ఈ ఆహారం తీసుకోండి

    ప్రస్తుతానికి ఈ మందును మాత్ర (టాబ్లెట్)లా కాకుండా... పొడి రూపంలో ప్యాకెట్‌లో ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగుతున్నారు. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. మూడో ట్రయల్స్ తర్వాత... అంతా ఓకే అనుకుంటే... దీన్ని టాబ్లెట్లలా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: