హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Droupadi Murmu : భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం.. కాసేపట్లో.. విశేషాలివే..

Droupadi Murmu : భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం.. కాసేపట్లో.. విశేషాలివే..

మోదీతో ముర్ము (ఫైల్ ఫొటో)

మోదీతో ముర్ము (ఫైల్ ఫొటో)

అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఇవాళ (సోమవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో సీజేఐ రమణ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. వివరాలివే..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఇవాళ (సోమవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. (Droupadi Murmu Oath Taking Ceremony)ఉదయం 10.15 గంటలకు పార్లమెంటు (Parliament) సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (CJI Ramana) ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం 21 గన్‌ సెల్యూట్‌తో ఆమెకు గౌరవ వందనం సమర్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఆ తర్వాత జాతిని ఉద్దేశించి నూతన రాష్ట్రపతి (President)ప్రసంగిస్తారు.

ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముందు పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము ఊరేగింపుగా పార్లమెంటుకు చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య విభాగాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు, పౌర, మిలటరీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Fiscal Council : ఎడాపెడా అప్పులు చేసే సీఎంలకు చెక్! -రాష్ట్రాల రుణాల అనుమతికి స్వతంత్ర వ్యవస్థ?


ఈ కార్యక్రమం అనంతరం నూతన రాష్ట్రపతి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. రాష్ట్రపతి భవన్‌ ఎదుట త్రివిధ దళాలు ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తాయి. పార్లమెంట్ సెంట్రల్ హాలులో, ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో కేంద్రం పెద్దలతోపాటు ముర్ముకు మద్దతిచ్చిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. బీజేపీయేతరుల్లో ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితురులు ఇవాళ ఢిల్లీ వెళతారు.

Farmers | Drones : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ.. పూర్తి వివరాలివే..


కాగా.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్తగా ఆ పదవికి ఎన్నికైన ద్రౌపది ముర్ము గౌరవార్థం ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఆమె తమ్ముడి భార్య అపురూపమైన సంతాలీ చేనేత చీరను బహూకరించారు. ఆ చీరను కట్టుకునే సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ముర్ము ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆమె సోదరుడు తారిణిసేన్‌ తుడు, ఆయన భార్య సుక్రీ తుడు, ముర్ము కుమార్తె ఇతిశ్రీ, ఆమె భర్త గణేశ్‌.. ఈ నలుగురు మాత్రమే హాజరు కానున్నారు. చీరతోపాటు ఆమెకు ఇష్టమైన ‘అరిశ పీఠా’ (మనం తినే నువ్వుల అరిసెలే) కూడా తీసుకెళ్తున్నట్లు ఢిల్లీకి బయల్దేరే ముందు ఆమె సోదరుడు చెప్పారు.

Published by:Madhu Kota
First published:

Tags: Draupadi Murmu, Monsoon session Parliament, Parliament, President Elections 2022

ఉత్తమ కథలు