• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DRIVING LICENCE TEST TO BE TOUGHER NITIN GADKARI SAYS IN PARLIAMENT HERE FULL DETAILS NS

Driving License Test: డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇక మరింత కఠినం.. వాహనాన్ని అలా కూడా నడిపితేనే..

Driving License Test: డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇక మరింత కఠినం.. వాహనాన్ని అలా కూడా నడిపితేనే..

ప్రతీకాత్మక చిత్రం

ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు. ఈ మేరకు పరీక్షలను మరింత కఠినం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో వివరాలను వెల్లడించారు.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేందుకు నిర్వహించున్న పరీక్షను మరింతగా కఠినతరం చేయనుంది. ఈ మేరకు లోక్‌సభకు కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ వివరాలు వెల్లడించారు. నూతన నిర్ణయంలో భాగంగా రివర్స్ గేర్ ఉన్న వాహనాల లైసెన్స్ కు అప్లై చేసిన వారు రివర్స్ లో ఆ వాహనాన్ని కచ్చితత్వంతో నడుపుతున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే నైపుణ్య పరీక్షల్లో తప్పనిసరిగా 69 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ల వద్ద ఈ పరీక్ష గురించి అవగాహన కల్పించేందుకు ఎల్‌ఈడీ తెరపై వీడియో ప్రదర్శించనున్నట్లు గడ్కరీ వివరించారు. క్వాలిఫైడ్, టాలెంటెడ్ డ్రైవర్లను తయారు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు గడ్కరీ చెప్పారు.

    ఇదిలా ఉంటే.. వాహనం నడపాలంటే మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. లెర్నర్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. లెర్నర్ లైసెన్స్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ సహకారంతో రోడ్లపై వాహనాలు నడుపుతూ డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా మొదట లెర్నర్ లైసెన్స్ తప్పనిసరి. టూవీలర్‌, ఫోర్ వీలర్‌ డ్రైవింగ్ కోసం లైసెన్స్ తీసుకోవచ్చు. అంతకన్నా భారీ వాహనాలు నడపడానికి కూడా లైసెన్స్‌లు ఉంటాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్‌ని జారీ చేస్తుంది. ఈ లైసెన్స్ ఉన్నవారే రోడ్లపై వాహనాలు నడపడానికి అర్హులు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్ట విరుద్ధం.

    డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్‌కి దరఖాస్తు చేయొచ్చు. 16 ఏళ్లు దాటినవారు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్‌కి దరఖాస్తు చేయొచ్చు. మోటార్ సైకిల్ ఇంజిన్ కెపాసిటీ కూడా 55 సీసీ కన్నా తక్కువ ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల డిక్లరేషన్ తప్పనిసరి. 18 ఏళ్లు దాటినవాళ్లు ట్రాన్స్‌పోర్ట్ వాహనం కాకుండా ఇతర వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేయొచ్చు. ఇక ట్రాన్స్‌పోర్ట్ వాహనం నడపడానికి లైసెన్స్ కావాలంటే వయస్సు 20 ఏళ్లు దాటాలి.
    Published by:Nikhil Kumar S
    First published: