వాహనదారులూ జాగ్రత్త... నేటి నుంచీ భారీ ఫైన్లు... కొత్త రూల్స్ అమలు...

New Traffic Fines : కేంద్రం తెచ్చిన కొత్త రవాణా రూల్స్ తెలిస్తే... వాహనం నడపడం కంటే... ఏ బస్సులోనో వెళ్లడం బెటరని మీకు అనిపిస్తే, తప్పేమీ కాదు. ఎందుకంటే... ఆ రూల్సూ, ఫైన్లూ మామూలుగా లేవు. జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 5:15 AM IST
వాహనదారులూ జాగ్రత్త... నేటి నుంచీ భారీ ఫైన్లు... కొత్త రూల్స్ అమలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
New Traffic Fines : సొంత వాహనం డ్రైవ్ చెయ్యడం ఇకపై అంత తేలిక కాదు. ముందు అసలు రూల్స్ ఏంటో బాగా తెలుసుకోవాలి. అవి తెలియకుండా రోడ్డెక్కితే... ఏదో ఒక రూల్ కింద బుక్కైపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే... నేటి నుంచీ కేంద్ర ప్రభుత్వం... కొత్త ట్రాఫిక్ రూల్స్ తెస్తోంది. అంటే... రూల్స్ పాతవే... వాటిపై వేస్తున్న ఫైన్లు మాత్రం కొత్తవి. అందువల్ల రూల్స్‌పై పూర్తి అవగాహన ఉంటేనే... ఫైన్ల నుంచీ తప్పించుకోగలం. సెప్టెంబర్ 1 నుంచీ 63 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అవి కాకుండా మరిన్ని ఉన్నాయి. వాటి సంగతి న్యాయశాఖ చూస్తోంది. ఆ శాఖ పని పూర్తైతే... అవి కూడా అమల్లోకి వస్తాయి. వాటిలో ఫైన్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, జాతీయ రవాణాకి సంబంధించినవి ఉన్నాయి.

రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ... భారీ ఫైన్లతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నేషనల్, రాష్ట్రాల హైవేల్లో ప్రమాదాల్ని తగ్గించేందుకు రూ.26వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇంత డబ్బును రాబట్టేందుకు ఫైన్లు కూడా భారీగా వేశారు. ఇప్పుడున్న ఫైన్లను ఐదు నుంచీ 10 రెట్లు పెంచారు. హెల్మెట్ లేకపోతే రూ.1000, మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా వేస్తున్నారు. ఆ ఫైన్ల వివరాలు తెలుసుకుంటే... ఇటీవల వచ్చిన మహేష్ బాబు సినిమా... భరత్ అనే నేనులో సీన్లు మీకు గుర్తొచ్చి తీరతాయి.

కొత్త ఫైన్ల వివరాలు ఇవీ :

హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.1000


సీటు బెల్టు పెట్టుకోకపోతే రూ.1000
అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోతే రూ.10000
అతి వేగంతో వెళ్తే రూ.5000లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5000
తాగి వాహనం నడిపితే రూ.10000 (జైలు శిక్ష కూడా)
ఓవర్ లోడింగ్ రూ.20000
మైనర్లు వాహనం నడిపితే రూ.25000
ట్రాఫిక్ లైన్ జంప్ చేస్తే రూ.5000
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.5000
రాంగ్ రూట్‌లో ఓవర్ టేక్ చేస్తే రూ.5000
ఆటోలో ఎక్కువ మంది కూర్చుంటే రూ.200
వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే ఏడాదికి వేసే రోడ్డు టాక్స్‌కి ఐదు రెట్ల అదనంగా ఫైన్. డీలర్‌పై 15 రెట్ల ఫైన్.
వాహనం ఉండాల్సిన సైజు కంటే పెద్దగా ఉంటే రూ.5000

చూశారుగా... ఫైన్లు ఎలా ఉన్నాయో. ఇవి మనకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. కానీ ఇవి మనకు వర్తించకుండా చేసుకోవాలంటే... మనం రూల్స్ ప్రకారం నడుచుకుంటే సరి. అప్పుడు మనం ఫైన్లు కట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే... బైక్ పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ పత్రాలు... అన్నీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. కనీసం ఆన్ లైన్ లోనైనా ఉండేలా చూసుకోవాలి. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపొద్దు. అలాగే కారు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి అంశాల్ని మర్చిపోకుండా పాటించాలి. ఫైన్లు వెయ్యడమే కాదు... ప్రమాద పరిహారాలు కూడా పెంచారు. ఇకపై ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే... వారికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల పరిహారం ఇవ్వనున్నారు.
First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>