HOME » NEWS » national » DRINK RASAM TO FIGHT AGAINST CORONA SAYS TAMIL NADU MINISTER RAMESH DEEPIKA PADUKONE FAVOURITE FOOD SK

దీపిక పదుకొణెకు ఎంతో ఇష్టమైన ఆహారం ఇదే.. తాగితే కరోనా ఖతమన్న మంత్రి

ఈ రెండు వీడియోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. దీపికా పదుకొణెకు ఇష్టమైన ఆ రసం తాగితే.. కరోనా రాదన్న మాట అంటూ తమిళనాడు మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

news18-telugu
Updated: January 13, 2021, 9:58 AM IST
దీపిక పదుకొణెకు ఎంతో ఇష్టమైన ఆహారం ఇదే.. తాగితే కరోనా ఖతమన్న మంత్రి
దీపికా పదుకొణె, తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ
  • Share this:
కరోనాను తరిమికొట్టే వ్యాక్సిన్ వచ్చేసింది. కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు దేశం నలుమూలలకూ చేరుకుంటున్నాయి. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఐతే కరోనాకు వ్యాక్సిన్‌తో పనిలేదన్నట్లుగా.. తమిళనాడు మంత్రి ఆసక్తికర చేశారు. రసం తీసుకుంటే కరోనా పరార్ అవతుందని.. ఇంకేమీ అవసరం లేదని రాజేంద్ర బాలాజీ అన్నారు. తమిళనాడు ప్రజలు ఆహార అలవాట్ల వల్లే కరోనా మనల్ని ఏమీ చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. రాజేంద్ర బాలాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

''తమిళనాడు ప్రజల ఆహార అలవాట్లే కరోనాను అడ్డుకోవడంలో కీలక పాత్రపోషించాయి. మన ఆహారంలో ఎన్నో ఔషద గుణాలున్న పదార్థాలను వాడుతాం. పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లితో రసం తయారు చేసుకుంటాం. ఈ రసం తాగితే కరోనా దరిచేరదు. విదేశీయుల ఇలాంటి ఆహార పదార్థాలు తినరు. అందుకే చాలా దేశాల్లో కరోనా విజృభిస్తోంది. కానీ తమిళనాడులో మాత్రం ఎక్కువగా ప్రభావం చూపలేకపోయింది.'' అని రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు.



మరోవైపు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తనకు ఇష్టమైన ఆహారాన్ని బయటపెట్టింది. దక్షిణ భారత వంటకమైన అన్నం, రసం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది.

ఈ రెండు వీడియోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. దీపికా పదుకొణెకు ఇష్టమైన ఆ రసం తాగితే.. కరోనా రాదన్న మాట అంటూ తమిళనాడు మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటివేనా ప్రజలకు చెప్పేదని మండిపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: January 13, 2021, 9:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading