హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

DRDO 2DG Drug : విడుదల చేసిన కేంద్రమంత్రులు..మొదటి విడతగా 10000 వేల సాచెట్స్..

DRDO 2DG Drug : విడుదల చేసిన కేంద్రమంత్రులు..మొదటి విడతగా 10000 వేల సాచెట్స్..

కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో బాధితులకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న 2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌ (2-డీజీ) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో బాధితులకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న 2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌ (2-డీజీ) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

DRDO 2DG Drug : భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా పౌడర్ 2DGని కేంద్రమంత్రులు హర్షవర్థన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు కలిసి విడుదల చేశారు.నేడు మొదటి బ్యాచ్‌గా మొత్తం పదివేల ప్యాకెట్స్‌ను పంపిణి చేయనున్నట్టు తెలిపారు. కాగా వీటిని దేశ రాజధాని ఢిల్లీ రోగులకు ముందుగా అందించనున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

డిల్లీలోని డీఆర్‌డీవో కేంద్ర కార్యాలయంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌లు

కాసేపటి క్రితం 2DG విడుదల చేశారు.. నోటి ద్వార తీసుకునే ఈ పౌడర్ కరోనా రోగులకు ఆక్సిజన్ పెట్టడాన్ని తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుందని క్లినికల్ ట్రయల్స్ తేలిందని రక్షణశాఖ ఇదివరకు ప్రకటించింది.

ప్రస్తుతం విడుదల చేసిన 2డీజీ ని తయారి కృషి చేసిన డీఆర్డీఓ తోపాటు డా.రెడ్డీస్ ల్యాబ్స్‌ను మంత్రి హర్షవర్థన్ అభిందించారు. దీంతో ప్రజలు కరోనా భారి నుండి త్వరగా కోలుకుంటారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అధికారులతో పాటు రెడ్డీస్ ల్యాబ్ సీఎండీ సతీష్ రెడ్డిలు పాల్గోన్నారు.

డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ సహకారంతో ఈ మందు హైదరాబాదులో  ఎక్కువ మోతాదులో తయారవుతోంది. ఈ 2DG మందు 'మోసగాన్ని మోసం చేయటం' అనే సూత్రంతో పని చేస్తుంది. ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి వాటినుంచి మోసం చేసి ప్రోటీన్ వాడుకుని పదింతలవుతుంది. ఇలా వైరస్ పెరగటానికి శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం వుంటుంది. గ్లూకోజ్ అణువుల నుండే వైరస్‌కు శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ పదింతలవుతుంది. ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. పెరిగే వైరస్ ఎక్కవై తెల్లకణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు.

అయితే ఈ 2 డీజీ మందు, వైరస్ ను మోసం చేసి గ్లూకోస్ అని భావించేలా చేస్తుందని. ఈ మందు అణువులను మింగిన వైరస్ లు గుడ్డివై ఇంకా కొత్త వైరస్ లను పుట్టించలేక పోతాయి. ఈ సమయంలో తెల్లకణాలు మిగిలిన వైరస్ లను నాశనం చేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కొన్ని.గంటలలోనే కరోనా వైరస్ జీరో అవుతుంది. ఈ మందు కనుక అనుకున్నవిధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబుకంటే చిన్న జబ్బుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో 2డీజి అధ్బుతంగా పని చేసినట్టు వెల్లడించారు..

First published:

Tags: Corona, Dr Reddy's, DRDO, Rajnath Singh

ఉత్తమ కథలు