డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) మరో ఘనత సాధించింది. సోమవారం అకాశ్ క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్షను శాస్త్రవేత్తలు నిర్వహించారు. గగన తలంలోని లక్ష్యాలను ఛేదించడానికి ఈ క్షిపణి ఆకాశ్ తోడ్పడుతుంది. ఈ రోజు నిర్వహించిన ఈ పరీక్షల్లో ఆకాశ్ తన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం విశేషం. ఈ పరీక్ష విజయవంతం కావడంతో ఇందుకు కారణమైన శాస్త్రవేత్తల బృందాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రతినిధుల సమక్షంలో ఈ పరీక్షలు జరిగాయి.
ఎలాంటి అంతరాయం లేకుండా ఈ మిస్సైల్ టార్గెట్ ను ఛేదించిందని డీఆర్డీఓ తెలిపింది. పరీక్షల సమయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, ఆన్ బోర్డ్ ఏవియానిక్స్, ఎయిరో డైనమిక్ కాన్ఫిగరేషన్ అత్యంత పర్ఫెక్ట్ గా పని చేశాయని డీఆర్డీఓ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.