హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Draupadi Murmu Oath Ceremony: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం.. గాంధీజీకి నివాళితో..

Draupadi Murmu Oath Ceremony: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం.. గాంధీజీకి నివాళితో..

రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) బాద్యతలు స్వీకరించారు. ఇవాళ (సోమవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ ముర్ముతో ప్రమాణం చేయించారు.

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) బాద్యతలు స్వీకరించారు. ఇవాళ (సోమవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ ముర్ముతో ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలుపంచుకున్నారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు ద్రౌపది ముర్ము రాజ్ ఘాట్ వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము ఊరేగింపుగా పార్లమెంటుకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత కొత్త రాష్ట్రపతి పార్లమెంట్ నుంచి ఊరేగింపుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. రాష్ట్రపతి భవన్‌ ఎదుట త్రివిధ దళాలు ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తాయి. జాతిని ఉద్దేశించి నూతన రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు..

దేశ స్వాతంత్ర్యం తర్వాత జన్మించి, అత్యున్నత పదవి చేపడుతోన్న తొలి వ్యక్తిగానే కాకుండా, తొలి ఆదివాసి మహిళగానూ ద్రౌపది ముర్ము పేరు రికార్డుల్లో నిలిచింది. అలాగే రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు కూడా ఆమె. ప్రస్తుతం ఆమె వయసు 64 ఏళ్లు.

Published by:Madhu Kota
First published:

Tags: Draupadi Murmu, President Elections 2022

ఉత్తమ కథలు