హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Draupadi Murmu: టీచర్ నుంచి ప్రెసిడెంట్ వరకు.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే

Draupadi Murmu: టీచర్ నుంచి ప్రెసిడెంట్ వరకు.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే

ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో... ఒడిశాలోని ఆమె స్వగ్రామంలోని పండగ వాతావరణం నెలకొంది. ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.

  భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము  (Draupadi Murmu) ఎన్నికయ్యారు. మనదేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠంపై గతంతో అగ్రకులాలు, మైనారిటీలు, దళితులు కూర్చున్నారు. కానీ ఆదివాసీలు ఇప్పటి వరకు ఆ పదవిని చేపట్టలేదు. ఐతే స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత అది సాధ్యమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో  ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నికైంది.  భారత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోతున్న రెండో మహిళగా, తొలి ఆదివాసిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha)పై విజయం సాధించిన ఆమె.. జులై 26న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


  ద్రౌపది ముర్ము ప్రస్థానం:

  64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా ఉపర్బెడా గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కెరీర్ ఆరంభంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు ద్రౌపది ముర్ము. అనంతరం బీజేపీలో చేరి పార్టీలో తనదైన ముద్రవేశారు. వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. పార్టీ అగ్రనేలతో పాటు ప్రజల మన్ననలను పొందారు. 1997లో కౌన్సిలర్‌గా ఆమె ఎన్నికయ్యారు. అనంతరం రాయ్‌రంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుంచి  ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్య, రవాణా మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2010, 2013లో మయూర్‌భంజ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా ద్రౌపది ముర్ము పనిచేశారు. ఆ తర్వాత ఝార్ఖండ్ 9వ గవర్నర్‌గా రాజ్యాంగ పదవి చేపట్టారు. 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా సేవలందించారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు.

  రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో... ఒడిశాలోని ఆమె స్వగ్రామంలోని పండగ వాతావరణం నెలకొంది. ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. ద్రౌపది ముర్ము స్వగ్రామం మయూర్‌భంజ్ జిల్లా ఉపెర్బెడా. ముర్ము తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవారు. ఆ తర్వాత రాయ్‌రంగ్‌పూర్ పట్టణానికి వెళ్లి స్థిరపడ్డారు. ఐనప్పటికీ ఉపెర్బెడాలో ముర్ము తండ్రి పేరు మీద ఓ ఇల్లు ఉంది. అందులో ముర్ము మేనల్లుడు నివసిస్తున్నారు. తమగ్రామానికి చెందిన మహిళ..  భారత రాష్ట్రపతిగా ఎన్నికవడంతో.. ఊరి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Draupadi Murmu, PM Narendra Modi, President Elections 2022

  ఉత్తమ కథలు