Home /News /national /

DRAGON WHO OPENED ANOTHER CONSPIRACY WITH MISSILE TEST INDIAS ANSWER WITH RAFALE UMG GH

china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..

 మిసైల్ పరీక్ష తో మరో  కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్  దిమ్మతిరిగే  సమాధానం..

మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..

చైనా(China) దేశం భారత్ పై తమ విషం చిమ్ముతూనే ఉంది. గాల్వాన్ లోయలో భారత్(India) చేతిలో దెబ్బ తిన్నప్పటి నుంచి రోజుకో కొత్త పన్నాగంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ తరుణంలో మన దేశంలోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మిసైల్ లను చైనా పరీక్షిస్తోంది.

ఇంకా చదవండి ...
డ్రాగన్ కంట్రీ చైనా మన దేశం మీద రోజుకొక కుయుక్తులు పన్నుతూనే ఉంది. జూలై 13 వ తేదీన శత్రు దేశం పాకిస్తాన్(Pakistan)-చైనా లు కలిసి హిందూ మహాసముద్రంలో పరేడ్ నిర్వహించాయి. ఇది చాలదు అన్నట్టుగా తాజాగా మిసైల్(Missile) తో చైనా మనదేశ భూభాగాలపై కన్నేసింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమే అని వాదిస్తోంది.

డెడ్లీ హిమార్స్ లాంటి రాకెట్ సిస్టమ్‌ను పరీక్షించిన చైనా..
పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) LAC వెంబడి కీలకమైన భారత సైనిక స్థావరాలను ఢీకొట్టగల అధునాతన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(MLRS)ను పరీక్షించింది. పశ్చిమ చైనాలోని ఎడారిలో ట్రక్కుపై అమర్చిన PCL-191 MLRSను పరీక్షించింది. ఇది కేవలం LAC వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో బలప్రదర్శన చేసిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొత్త హై- ఆల్టిట్యూడ్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ భారతదేశం సరిహద్దులో ఉన్న హిమాలయాలలో కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేయవచ్చని సమాచారం.

PCL-191 MLRS అంటే ఏంటి?
PCL 191 అనేది AR-3 MRL బేస్డ్‌ కొత్త చైనీస్ 370mm మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్. 2019లో చైనీస్ గ్రౌండ్‌ ఫోర్స్‌ సేవల్లోకి PCL-191 రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్‌ అడుగుపెట్టింది. ఈ సిస్టమ్‌ను వాన్‌షాన్ WS2400 8x8 ట్రక్కుపై అమర్చారు. 500 కి.మీ రేంజ్‌ ఉన్న రెండు 750 మి.మీ ఫైర్ డ్రాగన్ బాలిస్టిక్‌ మిసైల్స్‌, 350 కి.మీ రేంజ్‌ ఉన్న ఎనిమిది 370 ఎంఎం రాకెట్లను ప్రయోగించగల సత్తా దీని సొంతం. MLRS రేంజ్‌ను 500 కి.మీలకు పెరగడంతో, LAC వెంబడి ఏ భారతీయ సైనిక స్థావరంపైన అయినా దాడి చేయగల అవకాశం ఉందని మన ఆర్మీ అంచనా వేస్తోంది. PCL191ని అధిక ఎత్తులో అమర్చినప్పుడు మరింత సామర్థ్యంతో పని చేస్తుందని, దాని మ్యాక్సిమమ్‌ రేంజ్‌ అనేక రెట్లు పెరిగిందంటున్న యువాన్ వాంగ్ మిలిటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ థింక్ ట్యాంక్, రీసెర్చర్ జౌ చెన్మింగ్ తెలిపారు. MLRS ఇతర చైనీస్ గాడ్జెట్‌లు, రాడార్‌ సిస్టమ్‌ల నుంచి సహాయంతో పని చేస్తుంది. ఝెజియాంగ్ ప్రావిన్స్‌, హుజౌకి చెందిన పీఎల్‌ఏ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఈ సిస్టమ్‌ను డెప్లాయ్‌ చేసింది. అంతేకాకుండా PCL191 బ్రిగేడ్‌ను దేశంలో ఎక్కడైనా, తీరం నుంచి హిమాలయాల వరకు మోహరించవచ్చని పీఎల్‌ఏ మాజీ ఇన్‌స్ట్రక్టర్‌, మిలిటరీ కామెంటర్‌ సాంగ్ జోంగ్‌పింగ్ చెప్పారు.

ఇదీ చదవండి: Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !


భారత్-చైనా సరిహద్దు చర్చలు
భారతదేశం, చైనా మధ్య 16వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సమయంలోనే డెడ్లీ హిమార్స్ రాకెట్ ను పరీక్షించిందని మన సైన్యం ఆరోపిస్తోంది. అయితే చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండానే ఇరు దేశాల మధ్య 16వ రౌండ్ కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు జులై 17న ముగిశాయి. కానీ LAC వెంబడి పశ్చిమ సెక్టార్‌లో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. మిలిటరీ, దౌత్య మార్గాల ద్వారా సన్నిహిత సంబంధాలు ఏర్పడటానికి, చర్చలు కొనసాగించడానికి, మిగిలిన సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వీలైనంత త్వరగా రూపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు భారత్-చైనా సంయుక్త ప్రకటన చేశాయి. ఈ చర్చలు సుమారు భారత్ వైపున ఉన్నచుషుల్-మోల్డో సరిహద్దు సమావేశ స్థలంలో 12 గంటల పాటు జరిగాయి. గత కొన్ని రౌండ్ల చర్చల్లో పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి వెనక్కి తగ్గే ఒప్పందం దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ, ఇతర ఘర్షణ ప్రాంతాలైన డెమ్‌చోక్, డెప్సాంగ్‌లు ప్రస్తుత స్టాండ్‌ ఆఫ్‌లో భాగం కాదని చైనా చర్చలకు నిరాకరించింది. ఊదే సమయంలో తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్‌ పట్టుబట్టింది.


సరిహద్దు వద్ద మళ్ళీ ఉద్రిక్తతలు..
ఇరు దేశాలు పరస్పరం చర్చలు జరుపుతూనే ఉన్న ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు . భారత్ రాత్రి సమయాల్లోనూ ఫ్రంట్‌లైన్ జెట్‌లతో రిహార్సల్స్‌ను పెంచింది. రాఫెల్స్, Su 30MKIలతో సహా యుద్ధ విమానాలు లేహ్, థోయిస్ ఎయిర్ బేస్‌ల నుంచి మెరుగైన ఫ్రీక్వెన్సీతో పనిచేస్తున్నాయని ఆర్మీ అధికారులు అంటున్నారు. చైనా వైమానిక దళం టిబెట్ సరిహద్దులో అగ్రెస్సివ్‌ డిఫెన్స్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రారంభించిన తర్వాత భారత్ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రష్యా డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లోని లో తయారైన S-400 సిస్టమ్స్‌, స్థానికంగా తయారైన HQ-9 వ్యవస్థలను చైనా యాక్టివేట్‌ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా డ్రాగన్ కు భారత్ దీటుగా సమాధానం చెప్పాలని ధృడ నిశ్చయంతో ఉందని యుద్ధ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తునారు.
Published by:Mahesh
First published:

Tags: Corona, Indian Military, Indo China Tension, Missile

తదుపరి వార్తలు