HOME »NEWS »NATIONAL »dragon fruit name changed to kamalam by gujarat government ak

Dragon Fruit: చైనా ఎఫెక్ట్.. డ్రాగన్ ఫ్రూట్ పేరు మారింది... కొత్త పేరు ఇదే

Dragon Fruit: చైనా ఎఫెక్ట్.. డ్రాగన్ ఫ్రూట్ పేరు మారింది... కొత్త పేరు ఇదే
డ్రాగన్ ఫ్రూట్

Dragon Fruit: డ్రాగన్ పండు కమలం పువ్వు ఆకారంలో ఉండకపోయినప్పటికీ.. దానికి ఆ పేరు పెట్టాలని నిర్ణయించామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు.

  • Share this:
    డ్రాగన్ అంటే చైనాకు పర్యాయపదం. చైనాను డ్రాగన్ కంట్రీ అని కూడా మనం పిలుస్తుంటాం. సరిహద్దుల్లో చైనా బలగాలు భారత సైనికులను హతమార్చిన తరువాత రెండు దేశాల మధ్య గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా యాప్స్‌కు చెక్ చెప్పడంతో పాటు ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను కూడా సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకు ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఈ క్రమంలోనే మరో ఆలోచన చేసింది. డ్రాగన్ పండు పేరు మార్చాలని నిర్ణయించింది.

    డ్రాగన్ పండు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పిన ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ.. ఆ పండు పేరు మార్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. డ్రాగన్ అనే శబ్దం సరిగ్గా లేదని.. అందుకే ఆ పండు పేరును కమలం అని మార్చాలని నిర్ణయించామని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం ఇకపై డ్రాగన్ పండును కమలం పండు అని పిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రంలో ఉద్యానవన అభివృద్ధి మిషన్‌ను ప్రారంభించిన గుజరాత్ ప్రభుత్వం.. ఈ విషయాన్ని వెల్లడించింది.



    డ్రాగన్ పండు కమలం పువ్వు ఆకారంలో ఉండకపోయినప్పటికీ.. దానికి ఆ పేరు పెట్టాలని నిర్ణయించామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ఈ పేరు మార్పు అంశంలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కమలం అనేది బీజేపీ ఎన్నికల గుర్తు కావడం.. గాంధీనగర్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం పేరు కూడా శ్రీకమలం కావడం విశేషం.
    Published by:Kishore Akkaladevi
    First published:January 20, 2021, 09:57 IST

    टॉप स्टोरीज